Share News

Viral Video: తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.. పిల్లలు లిఫ్ట్ ఆట ఆడుతుండగా..

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:11 AM

పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అని పెద్దలు అంటుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు వారి పిల్లలు ప్రమాదంలో పడడానికి కారణమవుతుంటారు. ఆడుకుంటూ మేడ పైనుంచి కింద పడి కొందరు, ఎవరూ గమనించని సమయంలో...

Viral Video: తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.. పిల్లలు లిఫ్ట్ ఆట ఆడుతుండగా..

పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అని పెద్దలు అంటుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు వారి పిల్లలు ప్రమాదంలో పడడానికి కారణమవుతుంటారు. ఆడుకుంటూ మేడపైనుంచి కింద పడి కొందరు, ఎవరూ గమనించని సమయంలో ఏవేవో వస్తువులు మింగి మరికొందరు పిల్లలు మృత్యువాత పడడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి విషాద ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు పిల్లలు లిఫ్ట్ వద్ద ఆడుకుంటుండగా చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని (Mumbai) ధారవి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక కోజీ షెల్టర్ భవనంలోని లిఫ్ట్ వద్ద మహ్మద్ హుజీఫా అనే బాలుడు తన ఏడేళ్ల సోదరి, మూడేళ్ల సోదరుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్‌లో తమ ఫ్లోర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ముగ్గురూ కలిసి లిఫ్ట్‌లోకి వెళ్లి డోరు మూసి, తాము వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ నొక్కారు.

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


ఈ సమయంలో పెద్ద వాళ్లు ఎవరూ లేకపోవడంతో చిన్నారులు లిఫ్ట్ డోరు వద్ద ప్రమాదకర స్థితిలో ఆడుకుంటూ కనిపించారు. తాము దిగాల్సిన ఫ్లోర్ రాగానే ముందుగా ఇద్దరు చిన్నారులు డోరు తీసుకుని వేగంగా బయటికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ డోరు వేసి వెళ్లారు. హుజీఫా అనే బాలుడు బయటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ డోరుకు, (boy stuck in the middle of elevator door) బయటికి డోరుకు మధ్యలో ఇరుక్కున్నాడు. బయటి డోరు లాక్ అవడంతో తెరవడం అతడి వల్ల సాధ్యం కాలేదు. ఇంతలో లిఫ్ట్ కదలడంతో ఆ చిన్నారి రెండు డోర్ల మధ్య నలిగిపోయాడు.

Viral Video: ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా.. ఇండికేటర్ పాడవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..


ఈ ఘటనలో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత కొద్దిదూరం పైకి వెళ్లిన లిఫ్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో పెద్దవారు ఎవరైనా ఉండుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది’’.. అంటూ మరికొందరు, ‘‘దయచేసి ఎవరూ పిల్లలను ఇలా ఒంటరిగా వదలకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..

Updated Date - Aug 10 , 2024 | 09:50 AM