Share News

Viral Video: ఇదెక్కడి ప్రాంక్‌రా బాబోయ్.. చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం..

ABN , Publish Date - Aug 09 , 2024 | 10:05 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కాస్త వినూత్నంగా ఆలోచించాలే గానీ.. ఫేమల్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వివిధ రకాల వీడియోలు చేస్తుంటారు. వీటిలో ప్రాంక్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో...

Viral Video: ఇదెక్కడి ప్రాంక్‌రా బాబోయ్.. చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కాస్త వినూత్నంగా ఆలోచించాలే గానీ.. ఫేమల్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వివిధ రకాల వీడియోలు చేస్తుంటారు. వీటిలో ప్రాంక్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ప్రాంక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అవడంతో పాటూ లక్షల్లో ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే ప్రాంక్ వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ ప్రాంక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బాడీ బిల్డర్ ట్యాప్ వద్ద నిలబడి స్నానం చేస్తుంటాడు. ఇందులో ప్రాంక్ ఏముందీ అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు కామెడీ స్టార్ట్ అవుతుంది. ట్యాప్ కింద తల పెట్టి నీళ్లు పొసుకున్నతర్వాత సాధారణంగానే షాంపు రుద్దుకున్నాడు. ఆ తర్వాత షాంపు పోయేందుకు మళ్లీ ట్యాంప్ కింద తల పెట్టాడు.

Viral Video: తాగుడుకు బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..


ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ప్రాంక్ స్టార్ట్ అవుతుంది. అతను స్నానం చేస్తున్న గోడ వెనుక వైపు ఓ వ్యక్తి నిలబడి షాంపు బాటిల్ (Shampoo) తీసుకుని అతడి తలపై పోస్తాడు. అప్పటికే కొళాయి కింద తలను శుభ్రం చేసుకున్న ఆ వ్యక్తి.. తలపై మళ్లీ నురగ రావడంతో సరిగా శుభ్రం అవలేదని అనుకుంటాడు. దీంతో మళ్లీ కొళాయి కింద తల పెట్టి షాంపును మొత్తం శుభ్రం చేసుకుంటాడు. అయితే అతను అలా శుభ్రం చేసుకోగానే వెనుక ఉన్న వ్యక్తి.. మళ్లీ అతడి తలపై షాంపూను పోస్తాడు. దీంతో అతడికి ఆశ్చర్యం కలుగుంది. ఇలా పైన ఉన్న వ్యక్తి షాంపు పోయడం, ఇతను శుభ్రం చేసుకోవడం జరుగుతుంటుంది.

Viral Video: ఎంత స్నేహమైతే మాత్రం మరీ ఇదేంటీ.. రెండు రైళ్ల మధ్య వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..


ఇలా ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా.. మళ్లీ తలపై షాంపూ రావడంతో అతడికి విపరీతమైన కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు. ఇదంతా చూడ్డానికి అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. చాలా రోజుల కిందటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రాంక్ చూస్తుంటే నవ్వు ఆపుకోలేకున్నాం’’.. అంటూ కొందరు, ‘‘బతికిపోయాడు.. ఒకవేళ ఈ పని చేసిన వ్యక్తిని చూసుంటే చచ్చిపోయేవాడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 90వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి పడవను ఎక్కడైనా చూశారా.. వర్షం వస్తే దీని పరిస్థితి ఏంటో..

Updated Date - Aug 11 , 2024 | 07:05 AM