Share News

Viral Video: కాలం కలిసిరాకపోవడం అంటే ఇదేనేమో.. వీధిలోకి వచ్చిన మొసలికి.. చివరికి ఎలాంటి గతి పట్టిందంటే..

ABN , Publish Date - Aug 08 , 2024 | 01:46 PM

వరద నీటిలో కొట్టుకొచ్చిన మొసలి చివరకు గ్రామంలోకి వచ్చేసింది. ఉన్నట్టుండి వీధిలో భారీ మొసలిని చూసి అంతా షాక్ అయ్యారు. రోడ్డు పక్కన కాలువ వద్ద ఉన్న మొసలిని చూసి కుక్కలు వెంటపడ్డాయి. ఓ కుక్క...

Viral Video: కాలం కలిసిరాకపోవడం అంటే ఇదేనేమో.. వీధిలోకి వచ్చిన మొసలికి.. చివరికి ఎలాంటి గతి పట్టిందంటే..

‘‘తన బలం కంటే స్థాన బలమే కొప్ప’’.. అన్న సామెత చందంగా.. కొన్నిసార్లు ఎంత పెద్ద వారైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సామాన్యుల్లా ఉండాల్సిందే. అలాగే జంతువులు కూడా తమది కాని ప్రాంతంలో పిల్లుల్లా బతకాల్సిందే. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీధిలోకి అడుగుపెట్టిన మొసలి పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిజ్నోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతలన్నీ వరద నీటితో (floods) దర్శనమిస్తున్నాయి. మరోవైపు వరదలో పాములు, చేపలు తదితరాలు కొట్టుకొస్తు్న్నాయి.

Viral Video: కారులో అద్దం మధ్యలో ఇరుక్కున్న చిన్నారి తల.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి.. చివరికి ఏమైందో చూడండి..


ఈ క్రమంలో నంగల్ సోటి అనే గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరద నీటిలో కొట్టుకొచ్చిన మొసలి చివరకు (crocodile entered the village) ఈ గ్రామంలోకి వచ్చేసింది. ఉన్నట్టుండి వీధిలో భారీ మొసలిని చూసి అంతా షాక్ అయ్యారు. రోడ్డు పక్కన కాలువ వద్ద ఉన్న మొసలిని చూసి కుక్కలు వెంటపడ్డాయి. ఓ కుక్క మొసలి సమీపానికి వెళ్లి గట్టిగా మొరిగింది. దీంతో భయపడిపోయిన మొసలి కాలువ వెంబడి పరుగులు తీసింది. స్థానికులు కూడా మొసలిని వెంటపడ్డారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా దాని సమీపానికి వెళ్లి కాలితో గట్టిగా తన్నాడు.

Viral Video: మొదటి అంతస్తు నుంచి కుక్క ఫన్నీ గేమ్.. పైకి చూసే పాదచారులపై..


వ్యక్తి కాలితో తన్నడంతో మరింతగా భయపడ్డ మొసలి.. అక్కడి నుంచి వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించింది. చివరకు ఓ చోట ఆగి కాలువ నీటిలో మునిగింది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను గ్రామస్తులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్థానబలం అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘పిల్లిలా మారిన మొసలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 08 , 2024 | 01:46 PM