Share News

Viral Video: మొదటి అంతస్తు నుంచి కుక్క ఫన్నీ గేమ్.. పైకి చూసే పాదచారులపై..

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:25 PM

ఓ కుక్క పెద్ద బిల్డింగ్‌ మొదటి అంతస్తుపై నిలబడి పాదచారులను గమనిస్తోంది. ఈ క్రమంలో అది ఉన్నట్టుండి మాల్ గేమ్ స్టార్ట్ చేసింది. పాదచారులను గమనిస్తూ ఉన్న ఆ కుక్క.. ఎవరైనా పైకి చూడగానే..

Viral Video: మొదటి అంతస్తు నుంచి కుక్క ఫన్నీ గేమ్.. పైకి చూసే పాదచారులపై..

కుక్కలు కొన్నిసార్లు తెలివిగా ప్రవర్తిస్తూ ఆశ్చర్యపరిస్తే.. మరికొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. మరికొన్ని కుక్కలు మనుషులను అనుకరిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క మొదటి అంతస్తు పైనుంచి బాల్ గేమ్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాదచారుల పైకి బంతిని విసురుతూ అది చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క పెద్ద బిల్డింగ్‌ మొదటి అంతస్తుపై నిలబడి (dog throwing ball on strangers from the first floor) పాదచారులను గమనిస్తోంది. ఈ క్రమంలో అది ఉన్నట్టుండి మాల్ గేమ్ స్టార్ట్ చేసింది. తన వైపు చూసే పాదచారులను గమనిస్తూ ఉన్న ఆ కుక్క.. ఎవరైనా పైకి చూడగానే వెంటనే తన నోటిలోని బంతిని వారిపైకి విసురుతుంది. వారు కూడా విషయం అర్థం చేసుకుని చివరకు బంతిని మళ్లీ పైకి విసిరేస్తారు.

Viral Video: వామ్మో.. ఏనుగు పగబట్టిందా ఏంటీ.. ఊర్లోకి చొరబడి.. ఇళ్లను కూడా పేకమేడల్లా..


పైన పడిపోయిన బంతిని కుక్క మళ్లీ నోటికి కరుచుకుని కిందకు వేస్తుంటుంది. కొందరు పాదచారులు ఉన్నట్టుండి పైనుంచి బంతి పడడం చూసి షాక్ అయ్యారు. తర్వాత ఈ పనంతా కుక్క చేస్తోందని తెలుసుకుని నవ్వుకున్నారు. ఫైనల్‌గా వారు కూడా బంతిని మళ్లీ కుక్క వైపు విసిరి వెళ్లిపోయారు. ఇలా ఆ కుక్క చాలా సేపు అలాగే బాల్ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేసింది.

Viral Video: కారు రూఫ్‌పై షాకింగ్ సీన్.. ప్రేమికుల నిర్వాకం చూసి అవాక్కైన వాహనదారులు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క చాలా ఫన్నీగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్క ప్రజలకు గేమ్ నేర్పిస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 08 , 2024 | 12:26 PM