Share News

Viral Video: ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. కాస్త దూరం వెళ్లగానే.. ఒక్క అరుపుతో.. చివరకు..

ABN , Publish Date - Jul 30 , 2024 | 09:42 AM

పులులు, సింహాలు జనావాల్లోకి ప్రవేశించిన సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడులు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే ...

Viral Video: ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. కాస్త దూరం వెళ్లగానే.. ఒక్క అరుపుతో.. చివరకు..

పులులు, సింహాలు జనావాల్లోకి ప్రవేశించిన సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడులు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా కొన్నిసార్లు ఆశ్చర్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన చిరుతపులి చివరకు కుక్కను నోట కరుచుకుని వెళ్లిపోయింది. కాస్త దూరం వెళ్లగానే ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి బయట పెంపుడు కుక్క పడుకుని ఉంటుంది. అంతలో అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అటుగా వచ్చిన చిరుత పులి కుక్కను గమనిస్తుంది. ఎలాగైనా వేటాడాలనే ఉద్దేశంతో నక్కి నక్కి సమీపానికి వెళ్తుంది. చివరకు కుక్క (Leopard attack on dog) మెడ పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్తుంది.

Viral Video: కంప్యూటర్ల మధ్యలోకి దూరిన పాము.. ఏమాత్రం భయపడని ఈమె.. చివరకు ఎలా పట్టుకుందో చూడండి..


ఈ క్రమంలో కుక్క అరుపులు విన్న ఇంటి యజమానికి బయటికి వస్తాడు. చిరుత పులి కుక్కను ఎత్తుకెళ్లడం చూసి గట్టిగా (man chased the leopard) కేకలు వేస్తూ వెంటబడతాడు. అయితే కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. కాస్త దూరం వెళ్లగానే భయంతో దాన్ని వదిలేసి పారిపోతుంది. చివరకు కుక్క పరుగెత్తుకుంటూ యజమాని వద్దకు వచ్చేస్తుంది.

Viral Video: ఎద్దు విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. మేడపై నుంచి ఒక్కసారిగా..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భయంతో పరారైన చిరుత’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్క టైం బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండ వేస్తుండగా ఇలా చేశాడేంటీ.. చివరి నిమిషంలో వధువుకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

Updated Date - Jul 30 , 2024 | 09:42 AM