Share News

Viral Video: ఈ ఫ్యామిలీ ఏంటీ.. ఎక్కడా స్థలం లేనట్లు.. ఏకంగా రైలు బోగీలోనే..

ABN , Publish Date - Feb 24 , 2024 | 06:42 PM

కొన్నిసార్లు కొందరు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చుట్టు పక్కల వారితో మాకేంటి సంబంధం... అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: ఈ ఫ్యామిలీ ఏంటీ.. ఎక్కడా స్థలం లేనట్లు.. ఏకంగా రైలు బోగీలోనే..

విహారయాత్రలకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడపడం, సమూహంగా తిరగడం.. సంతోషంగా భోజనాలు చేయడం సర్వసాధాణంగా జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు కొందరు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. చుట్టు పక్కల వారితో మాకేంటి సంబంధం... అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుటుంబం మొత్తం కలిసి ఎక్కడా స్థలం లేనట్లు రైలు బోగీలోనే దుకాణం పెట్టేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ ఫ్యామిలీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రయాణ సమయాల్లో చాలా మంది బయట ఫుడ్ తినడం ఇష్టం లేక.. ఇంట్లో తయారు చేసుకుని తీసుకెళ్తుంటారు. ఖాళీ ప్రదేశాల్లో అంతా ఒకచోట కూర్చుని భోజనాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుటుంబం (family members are eating together in train coach) ఏకంగా రైల్లోనే సామూహిక భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన చాలా మంది కలిసి సమూహంగా రైలు ఎక్కారు. అంతా ఒకే చోట కూర్చుని, మధ్యలో కలిసే భోజనాలు తినడం మొదలెట్టారు.

Viral Video: కొడుకును స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. అంతలోనే ఎదురుగా వచ్చిన ఆవు.. చూస్తుండగానే..

ఇంటి వద్ద నుంచి తెచ్చుకుని అనేక రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఉంచి, ఎవరికి ఇష్టం వచ్చిన ఆహారాన్ని వారు తీసుకున్నారు. శాండ్‌విచ్‌లు, జామపండ్లు, అరటిపండ్లు, శీతల పానీయాలు, చిప్స్ ప్యాకెట్లు తదితరాలను ఒకరికొకరు పంచుకుంటూ సంతోషంగా భోజనాలు చేయడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది రైలులా లేదు.. హోటల్ తరహాలో ఉంది’’.. అంటూ కొందరు, ‘‘తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘బోగీని అపరిశుభ్రం చేసేస్తున్నారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral News: మహిళా టీచర్ వింత నిర్వాకం.. విద్యార్థులను ఆలయానికి తీసుకెళ్లి మరీ.. చివరకు..

Updated Date - Feb 24 , 2024 | 06:42 PM