Share News

Viral video: బల్బ్ హోల్‌ నుంచి వింత శబ్ధాలు.. లోపల ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

ABN , Publish Date - May 08 , 2024 | 08:56 PM

ఇళ్లలో అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మంచాల కింద నుంచి, ఫ్రిడ్జ్ డోర్ల నుంచి వింత వింత జీవులు బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ..

Viral video: బల్బ్ హోల్‌ నుంచి వింత శబ్ధాలు.. లోపల ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

ఇళ్లలో అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మంచాల కింద నుంచి, ఫ్రిడ్జ్ డోర్ల నుంచి వింత వింత జీవులు బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సీలింగ్ బల్బ్ హోల్ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో లోపల ఏముందా అని చూశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇంటి వరండాలోని సీలింగ్ బల్బ్ హోల్ నుంచి వింత వింత శబ్ధాలు రావడం మొదలెట్టాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం కలిగింది. అందులో పరిశీలించగా.. ఏదో వింత ఆకారం కనిపించింది. తీక్షణంగా పరిశీలించగా ఏదో వింత పాము ఉన్నట్లు కనిపించింది. దీంతో చివరకు స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందించారు.

Puzzle: మీ కంటి చూపు బాగుంటే.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


కాసేపటికి అక్కడికి చేరుకున్న మహిళా స్నేక్ క్యాచర్.. బల్బ్ హోల్‌లో చేయి పెట్టి.. చివరకు అతి పెద్ద కొండచిలువను (Large python) బయటికి లాగింది. దాంతో పాటూ చనిపోయిన ఓ పిల్లిలాంటి జీవి కూడా కిందపడింది. పిల్లిపై దాడి చేసిన చంపిన కొండచిలువు.. దాన్ని పట్టుకుని సీలింగ్‌లోకి దూరినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి సీన్ ముందెన్నడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘అంత పెద్ద కొండచిలువ సీలింగ్‌లోకి ఎలా వెళ్లింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: చనువుగా ఉంటూనే.. కాబోయే భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని యువతి షాక్.. చివరకు..

Updated Date - May 08 , 2024 | 08:56 PM