Share News

Viral Video: సింహాలను చూడటానికి సఫారీ వాహనాల్లో వెళ్తే.. చివరకు అవి చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Sep 29 , 2024 | 08:07 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పర్యాటకులు సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా వారు సింహాల సమీపానికి వెళ్లి ఆసక్తిగా తిలకిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సఫారీ వాహనాన్ని చూడగానే..

Viral Video: సింహాలను చూడటానికి సఫారీ వాహనాల్లో వెళ్తే.. చివరకు అవి చేసిన నిర్వాకం..

పులులు, సింహాలను సందర్శించే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు అత్యుత్సాహంతో వాటితో చెలగాటం ఆడబోయి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అలాగే మరికొన్నిసార్లు టూరిస్టుల పట్ల సింహాలు స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహాలకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాలను చూసేందుకు టూరిస్టులంతా సఫారీ వాహనాల్లో వెళ్లారు. అయితే చివరకు సింహాలు చేసిన నిర్వాకానికి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పర్యాటకులు సఫారీ వాహనాల్లో అడవిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా వారు సింహాల సమీపానికి వెళ్లి ఆసక్తిగా తిలకిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సఫారీ వాహనాన్ని చూడగానే రెండు సింహాలకు తెగ నచ్చేసిట్లుంది. వెంటనే (Lions on safari vehicle) జీపు పైకి ఎక్కాయి.

Viral Video: చెట్టెక్కినా వదలని ఎలుగుబంటి.. కాలు పట్టుకుని కిందకు లాగేయడంతో.. చివరకు..


అయితే జీపుపై రక్షణగా ఇనుప కడ్డీలు ఉండడంతో పర్యాటకులకు ఏమీ కాలేదు. జీపు పైకి ఎక్కిన ఓ సింహం పడుకుని ఉండగా.. మరో సింహం ఇంజిన్ బానైట్‌పై నిలబడి అడవిలో షికారు చేసింది. ‘‘రోజూ మీరేనా జంగిల్ సఫారీ చేసేదీ.. మేము చేయకూడదా’’.. అన్నట్లుగా ఆ సింహం జీపుపై నిలబడి అటూ, ఇటూ చూస్తూ రైడ్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. మరో వాహనంలో ఉన్న వారు ఈ దృశ్యం చూసి అవాక్కయ్యారు.

Viral Video: ఇలాంటి చేపలను ఎప్పుడైనా చూశారా.. సముద్ర గర్భంలో ఎలా నడుస్తున్నాయో చూస్తే..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జంగిల్ సఫారీ చేస్తున్న సింహాలు’’.. అంటూ కొందరు, ‘‘ఆహా ఈ సీన్ చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45వేలకు పైగా లైక్‌లు, 2.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండలు మార్చుకుంటుండగా వరుడికి ఊహించని షాక్.. ఉన్నట్టుండి వేదిక పైకి వచ్చిన యువకుడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 08:07 PM