Share News

Viral Video: దండలు మార్చుకుంటుండగా వరుడికి ఊహించని షాక్.. ఉన్నట్టుండి వేదిక పైకి వచ్చిన యువకుడు.. చివరకు..

ABN , Publish Date - Sep 29 , 2024 | 06:50 PM

ఓ వివాహ కార్యక్రమంలో అతిథుల సమక్షంలో వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. వరుడిపై వధువు అక్షింతలు చల్లుతుంది. అనంతంర వధూవరులు దండలు మార్చుకోవాల్సిన సమయం వస్తుంది. వధూవరుల మధ్యలో..

Viral Video: దండలు మార్చుకుంటుండగా వరుడికి ఊహించని షాక్.. ఉన్నట్టుండి వేదిక పైకి వచ్చిన యువకుడు.. చివరకు..

ప్రస్తుతం జరిగే చాలా వివాహ కార్యక్రమాల్లో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. వీటిలో కొన్ని కావాలని ప్లాన్ చేసి మరీ తీస్తుంటే.. మరికొన్ని అనుకోకుండా జరుగుతుంటాయి. కొన్నిసార్లు తాళ్లి కట్టే సమయంలో వధూవరుల్లో ఎవరో ఒకరు రివర్స్ అవుతుంటే.. మరికొన్నిసార్లు అపరితచ వ్యక్తులు పెళ్లి వేదిక పైకి వచ్చి రచ్చ రచ్చ చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరులు దండలు మార్చుకునే సమయంలో వరుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి ఓ యువకుడు వేదిక పైకి దూసుకురావడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో అతిథుల సమక్షంలో వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. వరుడిపై వధువు అక్షింతలు చల్లుతుంది. అనంతంర వధూవరులు (bride and groom) దండలు మార్చుకోవాల్సిన సమయం వస్తుంది. వధూవరుల మధ్యలో నిలబడిన ఓ మహిళ తన చేతిలోని దండలను వధూవరులకు ఇవ్వాలని చూస్తుంది.

Viral Video: ఇలాంటి చేపలను ఎప్పుడైనా చూశారా.. సముద్ర గర్భంలో ఎలా నడుస్తున్నాయో చూస్తే..


అయితే ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. సడన్‌గా ఓ యువకుడు వేదిక పైకి దూసుకొచ్చి మహిళ చేతిలోని దండను లాక్కొని వధువు మెడలో వేస్తాడు. తర్వాత ఆమెను కౌగిలించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే అక్కడే ఉన్న మహిళ అతడిని చెంపపై గట్టిగా కొడుతుంది. ఈ ఘటనతో అప్పటిదాకా సంతోషంగా ఉన్న వరుడు.. ఒక్కసారిగా షాక్ అవుతాడు. వధువు మెడలో ఆమె ప్రియుడు దండ వేయడంతో పెళ్లి మంటపంలో గందరగోళ వాతావరణం నెలకొంటుంది.

Viral Video: వామ్మో.. ఇది మాయా.. లేక మంత్రమా.. వైట్ పేపర్లను ఇతనెలా మారుస్తున్నాడో చూస్తే..


వీడియో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన తర్వాత వధువు కుటుంబ సభ్యులు.. సదరు యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆస్పత్రికిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. అయిత ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువకుడు సినిమాలో హీరోలా ఎంట్రీ ఇచ్చాడు’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. అనవసరంగా వచ్చి బుక్ అయ్యాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. కారు ఇంజిన్‌లో ఇలాంటి సీన్.. నెవర్ బిఫోన్.. ఎవర్ ఆఫ్టర్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 06:50 PM