Share News

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Sep 28 , 2024 | 07:15 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో జరుగుతున్న పెళ్లిలో వర్షం కారణంగా అతిథులంతా వెళ్లిపోయారు. వధూవరులతో పాటూ కొంతమంది మాత్రమే బంధువులు ఉన్నారు. ఇదిలావుండగా..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

ప్రస్తుతం పెళ్లిళ్లు అంటేనే వింతలు, వినోదాలకు కేంద్రంగా మారుతున్నాయి. కొన్ని పెళ్లిళ్లలో వధూవరుల ప్రవర్తన అంతా ఆశ్చర్యపోయేలా చేస్తుంటే.. మరికొన్నసార్లు అంతా అవాక్కయ్యేలా ఉంటోంది. ఇలా మొత్తంగా పెళ్లిళ్లలో చాలా మంది వధూరువరులు.. సినీ నటులను మరిపిస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వర్షంలో తడుస్తూ పెళ్లి వేదిక వద్దకు వచ్చిన వధువుకు వరుడు షాక్ ఇచ్చాడు. సమీపానికి రాగానే.. అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో జరుగుతున్న పెళ్లిలో వర్షం కారణంగా అతిథులంతా వెళ్లిపోయారు. వధూవరులతో పాటూ కొంతమంది మాత్రమే బంధువులు ఉన్నారు. ఇదిలావుండగా, వర్షంలోనూ వధువు (bride) చేతిలో బొకే పట్టుకుని వేదిక వద్దకు వచ్చింది.

Viral Video: పులినే భయపెట్టిన ఎలుగుబంటి.. పిల్లను రక్షించుకోవడానికి ఏం చేసిందో చూడండి..


వధువు రాకను చూసి వరుడు వేదిక మీద నుంచి ఠీవీగా కిందకు నడుస్తూ వచ్చాడు. అతడు కోపంగా ఉండడం చూసి వధువు కూడా సైలెంట్‌గా నిలబడి ఉంది. వరుడు దగ్గరికి రావడం చూసి తల కిందకు పెట్టి మౌనంగా నిలబడింది. అయితే తీరా దగ్గరికి వెళ్లిన వరుడు.. సడన్‌గా (groom sprinkles currency notes on bride) తన జేబులో నుంచి కరెన్సీ నోట్లను బయటికి తీసి వధువుపై వెదజెల్లాడు. దీంతో అప్పటిదాకా మౌనంగా ఉన్న వధువు.. అతడు చేసిన పనికి ముసిముసి నవ్వులు నవ్వింది. అక్కడే ఉన్న అతిథులంతా చుట్టూ చేరి కింద పడ్డ నోట్లను తీసుకున్నారు.

Optical illusion: ఈ గదిలో దాక్కున్న సీతాకోకచిలుకలను 30 సెకన్లలో కనుక్కోగలరా.. ?


మొత్తానికి ఈ ఘటనతో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న వాతావరణం కాస్త.. సందడిగా మారిపోయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘దంపతులు జీవితాంతం ఇలాగే ఉంటే ఏ సమస్యలూ రావు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా వ్యూస్, 300కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Sep 28 , 2024 | 07:15 PM