Share News

Viral Video: పిల్లి పిల్లపై కుక్కల దాడి.. గమనించిన తల్లి ఎలా కాపాడిందో చూస్తే..

ABN , Publish Date - Sep 27 , 2024 | 09:47 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు మీద వెళ్తున్న నాలుగు కుక్కలకు పక్కనే ఓ పిల్లి పిల్ల కనిపిస్తుంది. దాన్ని చూడగానే కుక్కలన్నీ కలిసి దాడికి దిగుతాయి. అయితే అక్కడే ఉన్న తల్లి పిల్లి గమనించి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. చివరకు ఏం జరిగిందంటే..

Viral Video: పిల్లి పిల్లపై కుక్కల దాడి.. గమనించిన తల్లి ఎలా కాపాడిందో చూస్తే..

తల్లికి మించిన దైవం లేదు.. తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్లి పిల్లపై నాలుగు కుక్కలు దాడికి దిగాయి. గమనించిన తల్లి పిల్లి చివరకు కుక్కలతో ఎదురుదాడికి దిగింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు మీద వెళ్తున్న నాలుగు కుక్కలకు (dogs) పక్కనే ఓ పిల్లి పిల్ల కనిపిస్తుంది. దాన్ని చూడగానే కుక్కలన్నీ కలిసి దాడికి దిగుతాయి. అయితే అక్కడే ఉన్న తల్లి పిల్లి గమనించి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. తన బిడ్డను కాపాడుకునేందుకు కుక్కలపై ఎదురుదాడి చేస్తుంది.

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..


అత్యంత వేగంగా పరుగెత్తుకుంటూ (Cat fight with dogs) వచ్చి కుక్కల పైకి దూకుతుంది. కుక్కలు కూడా పిల్లిపై దాడి చేయాలని చూస్తాయి. అయినా పిల్లి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూనే తన బిడ్డను కాపాడుకుంటుంది. ఆ తర్వాత కుక్కలను దారి మళ్లించేందుకు అక్కడి నుంచి మరో వైపు పారిపోతుంది. దీంతో కుక్కలు కూడా పిల్లిని వెంబడిస్తూ పారిపోతాయి.

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకొచ్చిన మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..


ఇలా తన బిడ్డను కుక్కల బారి నుంచి కాపాడుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఆహా.. ఇలాంటి తెలివి ఈమెకే సొంతం.. స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎలా తీసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 09:51 PM