Share News

Viral Video: పులినే భయపెట్టిన ఎలుగుబంటి.. పిల్లను రక్షించుకోవడానికి ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:25 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి తన పిల్లతో కలిసి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి ఓ పులి ఎదురుపడుతుంది. అప్పటికే..

Viral Video: పులినే భయపెట్టిన ఎలుగుబంటి.. పిల్లను రక్షించుకోవడానికి ఏం చేసిందో చూడండి..

పిల్లల ప్రాణాలు ముప్పు వాటిల్లుతుందని తెలిస్తే.. తల్లి తన ప్రాణాలు అడ్డుపెట్టయినా రక్షించుకుంటుంది. ఇది మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. జంతువులు తమ పిల్లలను రక్షించుకునే క్రమంలో పెద్ద పెద్ద జంతువులతో పోరాడిన ఘటనలు తరచూ చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఎలుగుబంటి తన పిల్లను రక్షించుకోవడానికి చివరకు పులినే భయపెట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎలుగుబంటి తన పిల్లతో కలిసి అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి ఓ పులి ఎదురుపడుతుంది. అప్పటికే ఆకలితో ఉన్న పులి ఎలుగుబంటి పిల్లను చూడగానే దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

Optical illusion: ఈ గదిలో దాక్కున్న సీతాకోకచిలుకలను 30 సెకన్లలో కనుక్కోగలరా.. ?


తన పిల్లపై పులి దాడి చేయడం చూసి తల్లి ఎలుగుబంటి ఎలర్ట్ అవుతుంది. వెంటనే పులిపై (Bear attack on tiger) ఎదురుదాడి చేస్తుంది. అయితే పులి కూడా ఎలుగుబంటిపై దాడి చేయాలని చూస్తుంది. అయినా ఎలుగుబంటి ఏమాత్రం భయపడకండా పులిపైకి దూకుతూ ముందు కాళ్లను పైకి లేచి భయపెడుతుంది. ఇలా పదే పదే మీదకు దూకుతూ భయపెట్డడంతో చివరకు పులి తోక ముడుస్తుంది. ‘‘దీంతో పోరాడటం నా వల్ల కాదు.. ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్’’.. అనుకుంటూ అక్కడి నుంచి పరుగందుకుంటుంది.

Viral Video: ఆహా.. ఇలాంటి తెలివి ఈమెకే సొంతం.. స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎలా తీసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


అయినా ఎలుగుబంటి దాన్ని వదలకుండా వెంబడిస్తుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘పులికి చుక్కలు చూపించిన ఎలుగుబంటి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్, 12 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 05:25 PM