Share News

Viral video: అరే.. ఇదేంటీ..! పామును ఇలాక్కూడా పట్టొచ్చా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - May 09 , 2024 | 05:40 PM

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో పాములను పట్టుకునే వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొందరు పాములను పట్టుకోవడంలో వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు..

Viral video: అరే.. ఇదేంటీ..! పామును ఇలాక్కూడా పట్టొచ్చా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో పాములను పట్టుకునే వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొందరు పాములను పట్టుకోవడంలో వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ డబ్బాలతో, మరికొందరు ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్‌లతో పాములను పట్టుకోవడం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి పామును పట్టుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరే.. ఇదేంటీ..! పామును ఇలాక్కూడా పట్టొచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఓ నాగుపాము (Cobra) ఇసుకలో బుసలు కొడుతూ ఉంటుంది. పామును చూసిన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను.. వస్తూ వస్తూ ఓ సంచితో పాటూ ప్లాస్టిక్ పైపును కూడా తీసుకొచ్చాడు. సంచికి పైపును కట్టేసి సిద్ధంగా ఉంచుకున్నాడు. బుస కొడుతున్న పాము వద్దకు వెళ్లి కాసేపు గమనించాడు. అతన్ని చూడగానే పాము బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నించింది.

Viral video: బల్బ్ హోల్‌ నుంచి వింత శబ్ధాలు.. లోపల ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్..


అయితే అతను దూరంనుంచి పైపును పాము తలకు దగ్గరగా పెడతాడు. దీంతో చివరకు పాము అందులోకి దూరిపోతుంది. సంచిలోకి వెళ్లిన పామును చుట్టేసుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘అరే.. పామును ఇలాక్కూడా పట్టొచ్చా’’.. అంటూ కొందరు, ‘‘పైపుతో పాము భలే పట్టేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 40 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఫోన్‌లో మాట్లాడుతూ పువ్వును పీకేసిన యువతి.. ఆ మరుక్షణమే..

Updated Date - May 09 , 2024 | 05:40 PM