Viral Video: ఇలా ఎవరైనా పడుకుంటారా.. మొత్తానికి ఫైర్ సిబ్బందికే షాక్ ఇచ్చాడుగా..
ABN , Publish Date - Dec 05 , 2024 | 07:04 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. ఆ వెంటనే వీడియోగా మారి.. చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ వీడియోల్లో ఇంకాస్త విచిత్రంగా ఉండే వీడియోలైతే తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బ్రిడ్జిపై వెళ్తున్న ఓ వ్యక్తికి పక్కనే ఉన్న భవనంపై ..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న ఘటన జరిగినా.. ఆ వెంటనే వీడియోగా మారి.. చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ వీడియోల్లో ఇంకాస్త విచిత్రంగా ఉండే వీడియోలైతే తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బ్రిడ్జిపై వెళ్తున్న ఓ వ్యక్తికి పక్కనే ఉన్న భవనంపై ఏదో ఆకారం కనిపించి, చివరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచాడు. అక్కడికి వచ్చిన సిబ్బంది చివరకు ఓ వ్యక్తి చేసిన నిర్వాకం తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇలా ఎవరైనా నిద్రపోతారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న బ్రిడ్జి (Bridge) పక్కన ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జిపై నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి పక్కనే ఉన్న బిల్డింగ్ వాటర్ ట్యాంక్‌పై (Water tank) ఏదో ఆకారం కనిపించింది. తీరా తగ్గరికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి పడుకుని ఉన్నట్లు కనిపించింది. ఎంత పిలిచినా పలక్కపోవడంతో చివరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.
Viral Video: ఈ వధువేంటీ మరీ విచిత్రంగా ఉందే.. మంటపం కూడా చేరకముందే.. అందరి ముందూ..
కాసేపటికి అక్కడికి చేరుకున్న సిబ్బంది.. అంత పెద్ద బిల్డింగ్ వాటర్ ట్యాంక్‌పై ప్రమాదకర స్థితిలో కూడా ఎంతో తాపీగా నిద్రపోతున్న (man lying on water tank) ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. వాటర్ ట్యాంక్‌పై దుప్పటి కప్పుకుని పడుకున్న ఆ వ్యక్తి.. కళ్లకు ఎండ తగలకుండా అద్దాలు కూడా పెట్టుకున్నాడు. బెడ్‌పై రిలాక్స్‌గా నిద్రపోయిన తరహాలో అంత ఎత్తులో తక్కువ స్థలంలో అలా ప్రమాదకరంగా పడుకోవడాన్ని చూసి అంతా తెగ నవ్వుకున్నారు. చివరకు అగ్నిమాపక సిబ్బంబి బ్రిడ్జి పైనుంచి ఓ నిచ్చెనను ఆ బిల్డింగ్ పైకి వేసి, దాని సాయంతో అతడి వద్దకు చేరుకున్నారు.
Viral Video: ఈ తాత మరీ అమాయకంగా ఉన్నాడే.. ఫోన్‌ను ఎలా శుభ్రం చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సోదరుడు యజధర్మరాజుతో పోరాడుతున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇంట్లో భార్యపై అలిగి వెళ్లాడేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..