Share News

Viral Video: వామ్మో.. మొసళ్ల గుంపు మధ్యలో వ్యక్తి వాకింగ్.. కాలు మోపగానే అవి చేసిన పని చూడండి..

ABN , Publish Date - Aug 11 , 2024 | 09:20 AM

మొసళ్లు చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి వాటి కంటపడ్డామంటే ఇక తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఇలాంటి ప్రమాదకర మొసళ్లు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: వామ్మో.. మొసళ్ల గుంపు మధ్యలో వ్యక్తి వాకింగ్.. కాలు మోపగానే అవి చేసిన పని చూడండి..

మొసళ్లు చూడ్డానికి ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి వాటి కంటపడ్డామంటే ఇక తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఇలాంటి ప్రమాదకర మొసళ్లు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్లాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మొసళ్లతో స్నేహంగా వారిని చూలా మందిని చూశాం. కొందరు యువతులు వాటితో చిన్నపిల్లల్లా ఆడుకుంటూ మాంసం ముక్కలను నోట్లో విసిరేయడం చూశాం, అలాగే మరో యువకుతి నీటిలో ఉన్న మొసలి వద్దకు వెళ్లి ముద్దు పెట్టి మరీ ఆహారం పెడుతున్న ఘటనను కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి భారీ మొసళ్ల గుంపు మధ్యలో వాకింగ్ చేసి అందరనీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Viral Video: అది రైలు అనుకున్నారా.. లేక పార్క్ అనుకున్నారా.. బోగీపై ఈ ప్రేమికుల నిర్వాకం చూస్తే..


పెద్ద పెద్ద మొసళ్లను ఓ ప్రాంతంలో ఉంచి సంరక్షిస్తునట్లు కనిపిస్తుంది. అయితే మొసళ్ల గుంపు మొత్తం నీటి ఒడ్డున పడుకుని ఉండగా.. ఓ వ్యక్తి వాటి మధ్యలోకి (man walking among crocodiles) చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్తాడు. అది కూడా వాటి పక్కనే కాలు పెడుతూ ఒక్కొక్క మొసలిని దాటుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతడు కాలు మోపగానే మొసళ్లే భయంతో పక్కకు జరుగుతూ అతడికి దారి ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఇలా మొసళ్ల మధ్యలో కాలు పెడుతూ ఓ వైపు నుంచి మరో పైపునకు దాటుకుంటూ వెళ్తాడు.

Viral Video: పామును చూసి వణికిపోయిన పులి.. రోడ్డుపై కోబ్రా ఎదరుపడగానే.. ఒక్కసారిగా..


సదరు వ్యక్తి ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఏంటిదీ.. కలా నిజమా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేస్తుంటే ఏదో ఒక రోజు వాటికి దాడికి గురవక తప్పదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

Updated Date - Aug 11 , 2024 | 09:25 AM