Share News

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 10 , 2024 | 11:15 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పోలీసుల తనిఖీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వాహనాల తనిఖీలో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్నీ క్షణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులకు.. ఓ ఈ రిక్షాలో ఓ వ్యక్తి అనుమానాస్పందంగా కనిపించాడు. దీంతో రిక్షాను ఆపి సమీపానికి వెళ్లి చూశారు. చివరకు..

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..

కాదేదీ కల్తీకి అనర్హం అనేది ఎంత సత్యమో.. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం.. అనికూడా కొందరు నిరూపిస్తుంటారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు కొందరు వివిధ రకాల వస్తువులను చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో రవాణా చేస్తుంటారు. కడుపులో బంగారు కాయిన్లు, తొండలో గోల్డ్ బిస్కట్లు తరలించడం చూశాం. అలాగే కూరగాయల లోడులో గంజాయి తదితరాలను తరలించడం కూడా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి పుస్తకాల మాటును తరలించిన వస్తువులను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పోలీసుల తనిఖీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వాహనాల తనిఖీలో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్నీ క్షణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులకు.. ఓ ఈ రిక్షాలో ఓ వ్యక్తి అనుమానాస్పందంగా కనిపించాడు. దీంతో రిక్షాను ఆపి సమీపానికి వెళ్లి చూశారు. అతడి కాళ్లపై ఓ పుస్తాకల బండిల్ కనిపించింది.

Viral Video: ఆవునే కదిలించిన చిన్నారి.. ఎదరుగా మైక్ పెట్టగానే.. ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అలాగే పక్కన కూడా మరికొన్ని పుస్తకాల బండిల్స్ కనిపించాయి. అయితే చివరకు వాటిని కూడా తెరవాలని చెప్పగా.. తప్పనిసరి పరిస్థితిల్లో ఆ వ్యక్తి పుస్తకాల బండిల్‌ను విప్పేశాడు. అయితే మొదటి పేజీని తీయగానే.. లోపల మద్యం ప్యాకెట్స్ (టెట్రా ప్యాకెట్స్) కనిపించాయి. పైకి చూసేందుకు పుస్తకాల తరహాలో కనిపిస్తున్నా.. మధ్యలో మొత్తం (Liquor Tetra packets Between the books ) మద్యం ప్యాకెట్లను నింపేశారు. ఈ సీన్ చూసి అక్కడున్న పోలీసులతో పాటూ జనం కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..


మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘పుస్తకాల మధ్యలో మందు ప్యాకెట్ల.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఇలాంటివి సమాచారం అందిస్తేనే పోలీసులు తెలుస్తుంది.. లేదంటే కనుక్కునే అవకాశమే లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.. పిల్లలు లిఫ్ట్ ఆట ఆడుతుండగా..

Updated Date - Aug 10 , 2024 | 11:15 AM