Share News

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

ABN , Publish Date - Aug 10 , 2024 | 09:39 AM

కారు, బస్సు, రైలు ప్రయాణాల్లో విండో సీట్‌లో కూర్చుని బయటి వ్యూ చూస్తుంటే కలిగే అనుభూతే వేరు. అందుకే చాలా మంది విండో సీట్లో కూర్చుని జర్నీ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక విమానాల్లో విండో సీట్ ప్రయాణ అనుభూతి ఇంకెలా ఉంటుందో ..

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

కారు, బస్సు, రైలు ప్రయాణాల్లో విండో సీట్‌లో కూర్చుని బయటి వ్యూ చూస్తుంటే కలిగే అనుభూతే వేరు. అందుకే చాలా మంది విండో సీట్లో కూర్చుని జర్నీ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక విమానాల్లో విండో సీట్ ప్రయాణ అనుభూతి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విమానం ఆకాశంలోని మబ్బుల మధ్య దూసుకెళ్తుండగా.. చూసే వారికి స్వర్గంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానాన్ని దాని పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకాశంలో దూసుకెళ్లే విమానాన్ని చాలా మంది అందులో కూర్చుని మాత్రమే చూస్తుంటారు. దీంతో దాని వేగం గురించి పూర్తి స్థాయిలో తెలియదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (airplane flying top view) ఆకాశ వీధిలో అత్యంత వేగంగా వెళ్లే విమానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


గంటకు 800 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానాన్ని insta360 డిగ్రీ కెమెరాతో బంధించారు. ఈ కెమెరాను ఎయిర్ బెలూన్ సాయంతో (Air balloon) అంతరిక్షంలోకి విడుదల చేశారు. అత్యంత ఎత్తులో ఉన్న కెమెరా.. దాని కింద నుంచి అతి వేగంతా వెళ్తున్న విమానాన్ని చిత్రీకరించింది. పొగలు చిమ్ముకుంటూ వెళ్తున్న విమాన వేగానికి రయ్.. మంటూ పెద్ద శబ్ధం వినిపించింది. అత్యంత వేగంతో దూసుకెళ్తున్న ఆ విమానం.. చూస్తుండగానే కాసేపటికి మాయమైంది. దీన్ని బట్టి దాని వేగం ఎతుందో మీరే ఊహించుకోవచ్చు.

Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వ్యూ ఎంతో అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇందులో చూస్తుంటే భూమి చదునుగా ఉన్నట్లు కనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.. పిల్లలు లిఫ్ట్ ఆట ఆడుతుండగా..

Updated Date - Aug 10 , 2024 | 09:53 AM