Share News

Viral Video: వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. వందల కొద్దీ టమాటాలను.. ఒక్క వేటుతో..

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:43 PM

వంట చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొందరు వంట చేయడంలో తమదైన ముద్ర వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు అంతా చేసే పనినే చాలా తెలివిగా చేస్తూ షాక్కు గురి చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. వందల కొద్దీ టమాటాలను.. ఒక్క వేటుతో..

వంట చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొందరు వంట చేయడంలో తమదైన ముద్ర వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు అంతా చేసే పనినే చాలా తెలివిగా చేస్తూ షాక్కు గురి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వందల కొద్దీ టామాలను ఎంతో వేగంగా కట్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసే క్రమంలో కూరగాయలను సిద్ధం చేశాడు. ఈ క్రమంలో టమాటాలను పెద్ద పాత్రలోకి తీసుకున్నాడు. వందల కొద్దీ టమాటాలను (Tomatoes) కట్ చేయాలంటే చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో అతను ఎంతో తెలివిగా వ్యవహరించాడు. ఓ పొడవాటి కత్తి తీసుకుని టమాటాలను అత్యంత వేగంగా అటూ, ఇటూ తిప్పుతూ కట్ చేశాడు.

Viral Video: కోతుల దెబ్బంటే ఎలా ఉంటుందో.. ఈ పులికి నడి రోడ్డుపైనే చూపించాయిగా..

ఇలా చూస్తుండగానే అన్ని టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. పాత్రను అటూ ఇటూ తిప్పుతూ టమాటాలను మొత్తం క్షణాల వ్యవధిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతను టమాటాలను కట్ చేసే విధానం కొత్తగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఫ్యామిలీ ఏంటీ.. ఎక్కడా స్థలం లేనట్లు.. ఏకంగా రైలు బోగీలోనే..

Updated Date - Feb 24 , 2024 | 09:43 PM