Share News

Viral Video: వస్తు మార్పిడి అంటే ఇదేనేమో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Aug 22 , 2024 | 06:47 PM

కోతుల చేష్టలు కొన్నిసార్లు విసుగు తెప్పించినా.. అప్పుడప్పుడూ వాటి తెలివి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషుల వద్ద ఉన్న వస్తువులను లాక్కుని ముప్పుతిప్పులు పెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్ని కోతులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. తమకు కావాల్సిన ...

Viral Video: వస్తు మార్పిడి అంటే ఇదేనేమో.. ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా..

కోతుల చేష్టలు కొన్నిసార్లు విసుగు తెప్పించినా.. అప్పుడప్పుడూ వాటి తెలివి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషుల వద్ద ఉన్న వస్తువులను లాక్కుని ముప్పుతిప్పులు పెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్ని కోతులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. తమకు కావాల్సిన ఆహాక పదార్థాలను మనుషులతోనే తెప్పించుకుంటాయి. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కళ్లద్దాలను ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వస్తు మార్పిడి అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న కోతికి ఎంత వెతికినా ఆహారం కనిపించలేదు. దీంతో దానికి చిర్రెత్తుకొచ్చింది. చివరకు అదిరిపోయే ప్లాన్ వేసింది. ఓ ఇంటికి వద్దకు వెళ్లి.. అక్కడున్న వ్యక్తి కళ్లద్దాలను ఎత్తుకెళ్లింది. చూస్తుండగానే వాటిని లాక్కుని (monkey stole the Eyeglasses) అక్కడే ఉన్న ఓ ఇనుప కంచెపై కూర్చుంది.

Viral Video: అప్పటిదాకా వధువు వెనుక నిలబడ్డ యువకుడు.. అంతలోనే వరుడి కళ్లుగప్పి..


కోతి కళ్లద్దాలను లాక్కెళ్లడంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. దాన్నుంచి కళ్లద్దాలను తీసుకోవడం కోసం వివిధ రకాలుగా ప్రయత్నించాడు. అయినా కోతి మాత్రం కళ్లద్దాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో కోతి డిమాండ్ ఏంటో తనకు అర్థమైంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఫ్రూట్ ప్యాకెట్ తీసుకొచ్చాడు. దాన్ని చూడగానే కోతి నోరూరింది. ‘‘నా ప్లాన్ వర్కవుట్ అయిందోచ్’’.. అని అనుకుంటూ అతను తెచ్చిన ఫ్రూట్ ప్యాకెట్ (fruit packet) తీసుకుని, తన చేతిలో ఉన్న కళ్లద్దాలను అతడికి ఇచ్చేసింది.

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..


ఇలా కోతి ఎంతో తెలివిగా తనకు కావాల్సిన ఫ్రూట్ ప్యాకెట్ తెప్పించుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా వస్తుమార్పిడి అంటే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 06:47 PM