Share News

Viral Video: అప్పటిదాకా వధువు వెనుక నిలబడ్డ యువకుడు.. అంతలోనే వరుడి కళ్లుగప్పి..

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:01 PM

ప్రస్తుతం జరిగే వివాహ కార్యక్రమాల్లో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. సినిమా సీన్ల తరహాలో కొన్నిసార్లు కామెడీ, మరికొన్ని సార్లు సీరియస్, ఇంకొన్నిసార్లు బాధాకర ఘటనలు చోటుచేసుకోవడం చూస్తుంటాం. కొన్ని యాధృచ్చికంగా జరిగితే.. మరికొన్ని..

Viral Video: అప్పటిదాకా వధువు వెనుక నిలబడ్డ యువకుడు.. అంతలోనే వరుడి కళ్లుగప్పి..

ప్రస్తుతం జరిగే వివాహ కార్యక్రమాల్లో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. సినిమా సీన్ల తరహాలో కొన్నిసార్లు కామెడీ, మరికొన్ని సార్లు సీరియస్, ఇంకొన్నిసార్లు బాధాకర ఘటనలు చోటుచేసుకోవడం చూస్తుంటాం. కొన్ని యాధృచ్చికంగా జరిగితే.. మరికొన్ని కావాలనే ప్లాన్ చేసి మరీ క్రియేట్ చేస్తుంటారు. వ్యూస్, లైక్‌ల కోసం కొందరు చేసే ప్రయత్నాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. అలాంటి ఓ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వధూవరులు కూర్చుని ఉండగా వధువు వెనుక నిలబడ్డ యువకుడు.. చివరకు వరుడు కళ్లుగప్పి ఏం చేశాడో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వధూవరులు (bride and groom) పెళ్లి వేదికపై సోఫాలో కూర్చుని ఉండగా.. బంధువులంతా అక్కడికి వచ్చి ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు వధువు వెనుకే నిలబడి ఉంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. చివరకు ఆ యువకుడు చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో షాకింగ్ సీన్.. దుస్తులు వేయాలని డోరు తీయగా..


అప్పటిదాకా వధువు వెనుకే నిలబడ్డ అతను.. వరువు ఎవరితో మాట్లాడుతుండడం చూసి.. కుంకుమ తీసుకుని (man puts Sindhur on bride forehead) వధువు నుదుటిపై బొట్టు పెడతాడు. ఇలా రెండు మూడు సార్లు బొట్టు పెట్టిన తర్వాత తన వెంట వచ్చేయమంటూ వధువుకు సైగ చేస్తాడు. ఆ సమయంలో వరుడు అటు వైపు తిరిగి ఉండడంతో వధువు కూడా చివరకు సోఫాలో నుంచి పైకి లేచి, ఆ యువకుడితో పాటూ వెళ్లిపోతుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి చేసిన మిస్టేక్‌తో అవాక్కైన వధువు.. చివరకు ఏమైందో చూడండి..


అయితే ఈ ఘటన మొత్తం చూస్తుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కావాలనే ఇలా చేసినట్లు అనిపిస్తుంది. అయినా కూడా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ యువకుడు ఎంత పని చేశాడు’’.. అంటూ కొందరు, ‘‘అంతా భలే యాక్టింగ్ చేస్తున్నారే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 03:01 PM