Share News

Viral Video: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. రోడ్డుపై టీవీఎస్‌ పైనే పడుకున్న వ్యాపారి.. ఏమైందా అని చూడగా..

ABN , Publish Date - Oct 14 , 2024 | 12:44 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి నెటిజన్లు భావేద్వేగానికి గురవుతున్నారు. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తం.. స్కూటర్‌పై తినుబండాలను పెట్టుకుని వీధి, వీధికీ వెళ్లి విక్రయిస్తున్నాడు. ఇలా అవిశ్రాంతంగా తిరగడంతో..

Viral Video: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. రోడ్డుపై టీవీఎస్‌ పైనే పడుకున్న వ్యాపారి.. ఏమైందా అని చూడగా..

కుటుంబ పోషణ నిమిత్తం ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. కొందరు శక్తి మించిన పనులు చేస్తూ శ్రమిస్తుంటే.. మరికొందరు విరామం లేకుండా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తుంటారు. అయితే ఇలాంటి వారిపై విధి కొన్నిసార్లు చిన్నచూపు చూస్తుంటుంది. తల్లిదండ్రులకు పిల్లలను, పిల్లలకు తల్లిదండ్రులను, అలాగే ఇంకొన్నిసార్లు ఇంటికి ఆధారంగా ఉన్న వారిని తీసుకెళ్లి.. తీరని శోకాన్ని మిగుల్చుతుంటుంది. ఇలాంటి హృదయ విదాకరక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్కూటర్‌పై తినుబండారాలను విక్రయిస్తూ ఉండగా... అలసిపోయి రోడ్డు పక్కన వాహనంపైనే విశ్రాంతి తీసుకున్నాడు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తం.. స్కూటర్‌పై తినుబండాలను పెట్టుకుని వీధి, వీధికీ వెళ్లి విక్రయిస్తున్నాడు. ఇలా అవిశ్రాంతంగా తిరగడంతో చివరకు తీవ్ర అలసటకు గురయ్యాడు.

Viral Video: చిరుత పవర్‌కు లైవ్ ఎగ్జాంపుల్.. జింకను ఎలా వేటాడిందో చూస్తే ఖంగుతింటారు..


అయినా వాహనంపై తిరుగుతూనే వస్తువులను విక్రయించాడు. అయితే చివరకు స్కూటర్‌ను ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆపి, కాసేపు విశ్రాంతి తీసుకుందామని వాహనంపైనే తల వాల్చి కునుకుతీశాడు. అయితే అలా పడుకున్న ఆ వ్యక్తి.. తిరిగి స్పృహలోకి రాలేదు. చాలా సేపు అలాగే పడుకుని ఉండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. దగ్గరికి వెళ్లి చూడగా.. అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Viral Video: వామ్మో.. బ్యాక్ టైరు లేకుండానే బైకు విన్యాసం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


స్కూటర్‌పై కూర్చున్న వ్యక్తి.. అలాగే ప్రాణాలు వదలడం చూసి అక్కడున్న వారంతా.. ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. పగవారికి కూడా ఇలా జరక్కూడదు’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. ఉన్నట్టుండి పైనుంచి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 01:44 PM