Share News

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. ఉన్నట్టుండి పైనుంచి..

ABN , Publish Date - Oct 14 , 2024 | 11:12 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ కాలనీలోని ఇంటి ముందు నిలబడి ఉంటుంది. సదరు ఇంటి యజమానులతో మాట్లాడిన ఆమె.. తర్వాత తన ఇంటికి వెళ్తుంటుంది. ఇలా రెండు, మూడు అడుగులు వేసేలోగానే..

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. ఉన్నట్టుండి పైనుంచి..

అదష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు.. అదే టైం బాగాలేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా భారీగా ఆస్తి, ప్రఆణ నష్టం సంభవిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి పైనుంచి ఓ పెద్ద ట్యాంక్ మీద పడడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ కాలనీలోని ఇంటి ముందు నిలబడి ఉంటుంది. సదరు ఇంటి యజమానులతో మాట్లాడిన ఆమె.. తర్వాత తన ఇంటికి వెళ్తుంటుంది. ఇలా రెండు, మూడు అడుగులు వేసేలోగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. పైనుంచి (plastic tank fell on woman) ప్లాస్టిక్ నీళ్ల ట్యాంక్ మీద పడింది.

Viral Video: చిరుత పవర్‌కు లైవ్ ఎగ్జాంపుల్.. జింకను ఎలా వేటాడిందో చూస్తే ఖంగుతింటారు..


అయితే ట్యాంక్ మధ్యలో ఆమె ఉండడంతో కింద ఉన్న రంధ్రంలో ఇరుక్కుపోయింది. కాసేపటికి ట్యాంక్‌ లోపలి నుంచి తల బయటికి పెట్టి పైకి చూసింది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు, అక్కడే ఉన్న కొంతమంది పరుగెత్తుకుంటూ వచ్చారు. బిల్డింగ్‌పై ట్యాంక్ పనులు చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే ఆ భవనంపై ట్యాంక్ పనులు చేస్తుండగా.. ప్రమాద వశాత్తు నీళ్ల ట్యాంక్ ఆమెపై పడినట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఆమె ట్యాంక్ మధ్యలో నిలబడడంతో ఎలాంటి గాయాలూ కాలేదు. దీంతో వారంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: వామ్మో.. బ్యాక్ టైరు లేకుండానే బైకు విన్యాసం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె టైం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంత ప్రమాదం జరిగినా ఆమె తినడం మాత్రం ఆపలేదు కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 83 వేలకు పైగా లైక్‌లు, 3.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గుర్రానికి షాక్ ఇచ్చిన పొట్టేలు.. చివరికి ఏం చేసిందో చూస్తే.. అవాక్కవాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 11:26 AM