Viral video: విమానం కూలిపోవడానికి ముందు.. సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్... చివరకు..
ABN , Publish Date - Mar 21 , 2024 | 09:41 PM
విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. టైం బాగోలేకపోతే అంతే స్థాయిలో విషాదాన్ని కూడా మిగల్చగలదు. గాల్లోకి వెళ్లిన విమానం కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ అవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అయితే ...
విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. టైం బాగోలేకపోతే అంతే స్థాయిలో విషాదాన్ని కూడా మిగల్చగలదు. గాల్లోకి వెళ్లిన విమానం కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ అవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తూ.. అంతా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానం కూలిపోవడానికి సెకన్ల ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. గాల్లో వెళ్తున్న విమానం వేగంగా భూమి మీదకు రావడం చూసి నేలపై ఉన్న చాలా మంది షాక్ అయ్యారు. మరికొంతమంది తమ ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నారు. చూస్తుండగానే విమానం అత్యంత వేగంగా భూమి పైకి దూసుకొచ్చింది. అయితే కొద్ది సేపట్లో భూమిని ఢీకొంటుందనగా.. విమానం నుంచి చాలా మంది పారాచ్యూట్ల సాయంతో కిందకు దూకారు. వారు దూకిన సెకన్ల వ్యవధిలో విమానం నేలను (plane hit the ground) బలంగా తాగి పేలిపోయింది. ఈ దాటికి పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించింది.
Viral video: బిడ్డ కోసం మొసలితో తలపడిన కోతి.. చివర్లో హృదయం ద్రవించే సీన్..
ఈ ఘటనను చూసి అక్కడే ఉన్న వారంతా అరుపులు, కేకలు పెట్టారు. అయితే ప్రయాణికులు పారాచ్యూట్ల సాయంతో క్షేమంగా ల్యాండ్ అవడంతో అంతా.. హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘ప్రయాణికులంతా ఎంతో తెలివిగా వ్యవహరించారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: కప్పల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి.. వాటి మధ్యలో పురుగును వదలడంతో చివరకు..