Share News

Viral video: పట్టుకోబోతుండగా కాటేసిన పాము.. అయినా భయపడని స్నేక్ క్యాచర్.. చివరకు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 08:28 PM

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములతో చెలగాటమాడి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు వాటిని ఎంతో చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇలాంటి...

Viral video: పట్టుకోబోతుండగా కాటేసిన పాము.. అయినా భయపడని స్నేక్ క్యాచర్.. చివరకు..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములతో చెలగాటమాడి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు వాటిని ఎంతో చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ స్నేక్ క్యాచర్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టుకోబోతుండగా ఉన్నట్టుండి అతడిని కాటేసింది. అయినా భయపడకుండా అతడు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పాము సంచరిస్తోందన్న సమాచారం అందడంతో స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. గడ్డిలో ఉన్న పామును వెతికి మరీ పట్టుకున్నాడు. తోక పట్టుకుని బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో ఆ పాము అతడి చేయిపై కాటేసింది. గట్టిగా పట్టుకుని కొరికేసింది. దీంతో కాసేపు అతను విలవిల్లాడిపోయాడు. అయినా ఏమాత్రం భయపకుండా పామును తల పట్టుకుని చాలా సేపు శ్రమించి పక్కకు లాగేశాడు. పాము కాటేయడంతో (snake bit the snake catcher) అతడి చేతిపై రక్తగాయాలయ్యాయి.

Viral video: బంగారు నగల మూటతో పారిపోతున్న దొంగలు.. అడ్డుకున్న పోలీసు.. సినిమా సీన్‌ను తలదన్నేలా..


పాము కాటు వేసినా భయపడకుండా అతను.. వాటి గురించి అవగాహన కల్పిస్తూనే ఉన్నాడు. అయితే ఆ పాము విషపూరితం కాకపోవడంతో అంతా హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది విషపూరితం కాదు’’.., ‘‘విషపూరితం కాకున్నా.. మీ ధైర్యానికి హ్యాట్సాప్ బ్రదర్’’.., ‘‘ఇలాంటి సాహసాలను ఎవరూ అనుకరించవద్దు’’.., ‘‘విషపూరితం కాకపోయినా.. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోండి బ్రదర్’’.., ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెట్టిన కుక్కపిల్ల.. చివరకు..

Updated Date - Jun 11 , 2024 | 08:28 PM