Share News

Viral video: రాళ్లను పగులగొడుతుండగా కలిసొచ్చిన అదృష్టం.. అడుగున అనుమానాస్పదంగా ఉండడంతో..

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:38 PM

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కొందరు దేనికోసమో వెతుకుంటే ఇంకేదో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఏకంగా బంగారు వస్తువులే బయటపడుతుంటాయి. ఇంకొన్నిసార్లు..

Viral video: రాళ్లను పగులగొడుతుండగా కలిసొచ్చిన అదృష్టం.. అడుగున అనుమానాస్పదంగా ఉండడంతో..

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కొందరు దేనికోసమో వెతుకుంటే ఇంకేదో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఏకంగా బంగారు వస్తువులే బయటపడుతుంటాయి. ఇంకొన్నిసార్లు మట్టిలో తవ్వుతుండగా.. పురాతన వస్తువులు బయటపడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రాళ్లను పగులగొడుతుండగా.. ఓ వ్యక్తి అదృష్టం వరించింది. అడుగున అనుమానాస్పందంగా కనిపించడంతో పరిశీలించి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సుత్తితో బండరాళ్లను పగులగొడుతుంటాడు. ఓ పెద్ద బండరాయి పక్కనే ఉన్న మరో రాయిని పగులగొడుతుంటాడు. ఈ క్రమంలో అతను ఓ రాయి కింద పూర్తిగా ఇనుప రాడ్లు ఉంచి సుత్తితో గట్టిగా కొట్టి మొత్తం పెకలించేస్తాడు. ఆ తర్వాత ఆ రాయి కింద ఉన్న మట్టిని తొలగిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి మట్టి కింద ఏదో అనుమాస్పదంగా కనిపిస్తుంది. ఏంటా అని చూడగా.. ఏకంగా ఓ పెద్ద వజ్రం (diamond) కనిపిస్తుంది.

Viral video: పులిని చూడగానే పారిపోయిన జింక.. ఆ వెంటనే వెనక్కు వచ్చి మరీ దాడి.. కారణమేంటో తెలిస్తే..


వజ్రాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించి చూడగా మెరిపోతూ కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! అదృష్టమంటే ఇతడిదే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే.. ఈ వజ్రం చాలా విలువైనదిగా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇదంతా కావాలని ప్లాన్ చేసి వీడియో తీసినట్లుగా ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: కారు నంబర్ ప్లేటు తీసి చూడగా.. లోపల షాకింగ్ సీన్.. ఈ డ్రైవర్ తెలివితేటలు మామూలుగా లేవుగా..

Updated Date - Jun 08 , 2024 | 06:38 PM