Share News

Viral video: అసభ్యకరంగా డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిని వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:29 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో మహిళలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులోనూ యువతులు డాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. అయితే...

Viral video: అసభ్యకరంగా డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిని వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో మహిళలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులోనూ యువతులు డాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. అయితే ఈ క్రమంలో కొందరు యువతులు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. అసభ్యకరంగా డాన్స్‌లు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి వృద్దురాలి ముందు అసభ్యకరంగా డాన్స్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రాత్రివేళ జరుగుతున్న కార్యక్రమంలో కొందరు యువతులు స్టేజిపై డాన్స్ (young women Dance) చేస్తుంటారు. ఈ క్రమంలో వారి డాన్స్ శృతిమించిపోతుంది. అసభ్యకరంగా డాన్స్‌లు వేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడున్న చాలా మంది యువకులు వారి డాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు.. (old woman was angry) యువతుల అసభ్యకర డాన్స్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Viral video: ఆవిరి రైలుతో యువతి సెల్ఫీ వీడియో.. అంతా చూస్తుండగానే.. చివరకు..


యువతిని ప్రవర్తనతో విసిగిపోయిన వృద్ధురాలు.. ‘‘నీకు కొంచెమైనా బుద్ధి ఉందా.. ఇలాంటి డాన్స్‌ చేయడానికి బుద్ధి లేదా’’.. అంటూ స్టేజి వద్దకు వెళ్లి యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఆ యువతి మాత్రం వృద్ధురాలి మాటల్ని అసలు పట్టించుకోదు. పైగా మరో అడుగు ముందుకేసి.. ఆమె ఎదుటే మరింత అసభ్యకరంగా డాన్స్ చేస్తుంది. దీంతో వృద్ధురాలికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఓ కర్ర తీసుకుని యువతి కొట్టేందుకు ప్రయత్నిస్తుంది.

Viral video: గేదె మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆ వెంటనే అతడు చేసిన నిర్వాకంతో..


వృద్ధురాలు కొట్టేందుకు ప్రయత్నించడంతో ఆ యువతి మరింత రెచ్చిపోయి డాన్స్ చేస్తుంది. మరోవైపు వృద్ధురాలు కూడా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ క్రమంలో అక్కడున్న వారు వృద్ధురాలిని పక్కకు తీసుకెళ్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి మరీ దారుణంగా ప్రవర్తిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వృద్ధులను గౌరవించడం నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jun 06 , 2024 | 09:29 PM