Share News

Viral video: డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను తలదన్నే సీన్.. ఈ అత్తాకోడళ్ల గొడవ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jun 07 , 2024 | 05:04 PM

అత్తాకోడళ్లు అంటేనే బద్ధశత్రులకు నిదర్శనంగా అనిపిస్తుంటారు. చాలా ఇళ్లల్లో అత్తాకోడళ్ల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కాసేపటికే అవి సర్దుకుపోతుంటాయి. అయితే...

Viral video: డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను తలదన్నే సీన్.. ఈ అత్తాకోడళ్ల గొడవ మామూలుగా లేదుగా..

అత్తాకోడళ్లు అంటేనే బద్ధశత్రులకు నిదర్శనంగా అనిపిస్తుంటారు. చాలా ఇళ్లల్లో అత్తాకోడళ్ల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కాసేపటికే అవి సర్దుకుపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఇవి చాలా దూరం వెళ్తుంటాయి. మరికొన్నిసార్లు సినిమాల్లో చూపించే విధంగా షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అత్తాకోడళ్ల గొడవకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను తలదన్నే సీన్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య ఉన్నట్టుండి గొడవ మొదలవుతుంది. కోడలు వంటింట్లో పకోడీలు చేస్తుండగా.. (mother-in-law quarreled with the daughter-in-law) అత్త గొడవ పెట్టుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. అది కాస్తా కాసేపటికి పెద్ద గొడవగా మారుతుంది. దీంతో కోడలికి కోపం కట్టలు తెంచుకుంటుంది. చేతిలో ఉన్న పకోడీల పిండిని నేలకేసి కొడుతుంది. దీంతో ఆ పిండి మొత్తం చెల్లాచెదురుగా పడిపోతుంది.

Viral video: అసభ్యకరంగా డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిని వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


అంతటితో ఆగని కోడలు.. బూతులు తిడుతూ ఆ పిండిని చేతిలోకి తీసుకుని, అత్త మొఖానికి పూసేస్తుంది. ఇలా చేయడంతో అత్తకు కూడా ఆవేశం పెరిగిపోతుంది. చివరకు ఆమె కూడా పిండిని తీసుకుని కోడలికి బలవంతంగా పూస్తుంది. ఇలా చాలా సేపు ఇద్దరూ గొడవపడుతారు. పక్కనే ఉన్న మరో మహిళ వారికి ఎంత సర్దిచెప్పాలని చూసినా ఫలితం ఉండదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గొడవ ముందు డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్ కూడా దిగదుడుపే’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా ఫన్నీ కోసం కావాలనే చేసినట్లు అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: హీరోలు కూడా చేయలేని స్టంట్స్.. చావుతో చెలగాటం అంటే ఇదేనేమో..

Updated Date - Jun 07 , 2024 | 05:28 PM