Share News

Viral video: హీరోలు కూడా చేయలేని స్టంట్స్.. చావుతో చెలగాటం అంటే ఇదేనేమో..

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:28 PM

నేలపై నుంచి ఒకే ఒక్క జంప్‌తో మేడపైకి ఎగరడం, పెద్ద పెద్ద బిల్డింగ్‌ల పైనుంచి అవలీలగా దూకేయడం వంటి షాకింగ్ ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. హీరోలు చేసే ఇలాంటి విన్యాసాలు చూసిననప్పుడు ఒళ్లు గడుర్పొడుస్తుంది. అయితే ...

Viral video: హీరోలు కూడా చేయలేని స్టంట్స్.. చావుతో చెలగాటం అంటే ఇదేనేమో..

నేలపై నుంచి ఒకే ఒక్క జంప్‌తో మేడపైకి ఎగరడం, పెద్ద పెద్ద బిల్డింగ్‌ల పైనుంచి అవలీలగా దూకేయడం వంటి షాకింగ్ ఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం. హీరోలు చేసే ఇలాంటి విన్యాసాలు చూసిననప్పుడు ఒళ్లు గడుర్పొడుస్తుంది. అయితే ఇలాంటి సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు ఇంతకంటే ఆశ్చర్యకర ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు సినిమాల్లో హీరోలు సైతం చేయలేని విన్యాసాలను నిజ జీవితంలో కొందరు అవలీలగా చేసేస్తుంటారు. తాజాగా, ఇలాంటి విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ చావుతో చెలగాటం అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఎత్తైన బిల్డింగ్‌పై విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో ఎలాంటి విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అయితే మీరు పొరపడ్డట్లే. ఈ యువకుడు అత్యంత ఎత్తైన బిల్డింగ్‌పై విన్యాసం (man srtunts on building) చేయడమే కాకుండా కాకుండా బిల్డింగ్ చివరన ఉన్న రక్షణ గోడపై నిలబడి, పక్కన ఉన్న బిల్డింగ్‌పై దూకేశాడు. బిల్డింగ్‌ రక్షణ గోడపై నిలబడి, అవతల బిల్డింగ్‌పై ఉన్న రక్షణ గోడపైకి జంప్ చేస్తాడు. అది కూడా మామూలుగా కాకుండా రౌండ్లు తిరుగుతూ దూకుతాడు.

Viral video: గేదె మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆ వెంటనే అతడు చేసిన నిర్వాకంతో..


అయినా సరిగ్గా అవతలి బిల్డింగ్ రక్షణ గోడపైకి నిలబడతాడు. అంతటితో ఆగకుండా మళ్లీ ఆ గోడ పైనుంచి వెనక్కు వంగుతాడు. ఈ సమయంలో అతను ఎక్కడ కిందపడిపోతాడో అని అనిపిస్తుంది. కానీ అతను మాత్రం ఎంతో చాకచక్యంగా చేతులో ఆ గోడను పట్టుకుని వేలాడుతూ విన్యాసం చేస్తాడు. ఫైనల్‌గా మళ్లీ గోడపైకి జంప్ చేసి, అటూ ఇటూ నడుస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేం స్టంట్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘చూడాలన్నా భయమేస్తోంది బాబోయ్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ అనుకరించవద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: అసభ్యకరంగా డాన్స్ చేస్తున్న యువతి.. సమీపానికి వెళ్లిని వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

Updated Date - Jun 07 , 2024 | 04:28 PM