Share News

Viral video: ఇదెక్కడి ఐడియారా బాబోయ్..! బీరువా డోరు తీస్తే.. లోపల మీరెవరూ ఊహించని సీన్..

ABN , Publish Date - Jun 07 , 2024 | 07:54 PM

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ చిత్రవిత్రమైన పనులు చేస్తుంటే.. మరికొందరు చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యే పనులు చేస్తుంటారు. ఇలాంటి టాలెంట్‌కు ఇండియాలో కొదవే లేదు అనేందుకు నిదర్శనంగా...

Viral video: ఇదెక్కడి ఐడియారా బాబోయ్..! బీరువా డోరు తీస్తే.. లోపల మీరెవరూ ఊహించని సీన్..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ చిత్రవిత్రమైన పనులు చేస్తుంటే.. మరికొందరు చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ అంతా అవాక్కయ్యే పనులు చేస్తుంటారు. ఇలాంటి టాలెంట్‌కు ఇండియాలో కొదవే లేదు అనేందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బీరువా డోర్లతో చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. బీరు డోరు తీయగా.. లోపల కనిపించిన దృశ్యం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదెక్కడి ఐడియారా బాబోయ్..!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత బీరువాను వినూత్నంగా ఉపయోగించారు. బీరువా (cupboard) డోర్లను పీకేసి, వాటితో ఏదైన కొత్త ప్రయోగం చేయాలని ఆలోచించాడు. చివరకు అతడికి ఓ మహత్తరమైన ఐడియా వచ్చేసింది. ఇంట్లో నిర్మించే టాయిలెట్‌కు (toilet) బీరువాను ఎందుకు ఉపయోగించకూడదు.. అని అనుకున్నాడు. అంతే.. వెంటనే పాత బీరువా డోర్లు ఊడదీసి, వాటిని బాత్రూం గోడల్లాగా ఏర్పాటు చేశాడు. తలుపు స్థానంలో బీరువా డోర్లను ఏర్పాటు చేశాడు. చూసేందుకు ఇది బీరువాలాగే ఉంటుంది.

Viral video: హీరోలు కూడా చేయలేని స్టంట్స్.. చావుతో చెలగాటం అంటే ఇదేనేమో..


బీరువా కదా అనుకుని దగ్గరికి వెళ్లి డోర్లు తీస్తే.. మాత్రం లోపల టాయిలెట్ గది కనిపిస్తుంది. ఇలా టాయిలెట్ గదిని బీరువా ఆకారంలో నిర్మించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘దొంగలు ఈ బీరువాను తెరిస్తే ఖంగుతింటారేమో’’.. అంటూ మరికొందరు. ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్‌ను తలదన్నే సీన్.. ఈ అత్తాకోడళ్ల గొడవ మామూలుగా లేదుగా..

Updated Date - Jun 07 , 2024 | 07:54 PM