Share News

Viral video: కారు నంబర్ ప్లేటు తీసి చూడగా.. లోపల షాకింగ్ సీన్.. ఈ డ్రైవర్ తెలివితేటలు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:03 PM

కొందరు తెలివితేటలు చూస్తే ‘‘అరె..! ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. చాలా మంది తప్పు చేసినా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా కవర్ చేసుకుంటుంటారు. అయితే ...

Viral video: కారు నంబర్ ప్లేటు తీసి చూడగా.. లోపల షాకింగ్ సీన్.. ఈ డ్రైవర్ తెలివితేటలు మామూలుగా లేవుగా..

కొందరు తెలివితేటలు చూస్తే ‘‘అరె..! ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. చాలా మంది తప్పు చేసినా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా కవర్ చేసుకుంటుంటారు. అయితే ఆ తప్పులు బయటపడిన సందర్భంలో ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు పోలీసులకు దొరక్కుండా ఎంతో తెలివిగా తప్పించుకంటుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తన కారు నంబర్ ప్లేటు స్థానంలో దాచి ఉంచిన వస్తువులను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో గుజరాత్ (Gujarat) నంబర్ ప్లేటుతో ఉన్న వాహనంపై అనుమానం కలిగింది. నంబర్ ప్లేటు (Car number plate) అనుమానాస్పదంగా ఉండడంతో చివరికి దాన్ని తెరిపిస్తారు. కారు డ్రైవర్ నంబర్ ప్లేటు తీయగా.. దాని వెనుక ఖాళీ స్థలం కనిపించింది. తర్వాత అతను అందులో చేయి పెట్టి మద్యం బాటిళ్లను బయటికి తీశాడు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి.. మద్యం బాటిళ్లను బయటికి తీశాడు. నంబర్ ప్లేటు కింద నుంచి మద్యం బాటిళ్లను (Liquor bottles) దాచి పెట్టడం చూసి అంతా షాక్ అయ్యారు.

Viral video: ఇదెక్కడి ఐడియారా బాబోయ్..! బీరువా డోరు తీస్తే.. లోపల మీరెవరూ ఊహించని సీన్..


గుజరాత్‌లో మద్యనిషేదం ఉన్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఇలా గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కారు యజమాని తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘నంబర్ ప్లేటు కింద మందు బాటిళ్లు.. సూపర్ ఐడియా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 53 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: పులిని చూడగానే పారిపోయిన జింక.. ఆ వెంటనే వెనక్కు వచ్చి మరీ దాడి.. కారణమేంటో తెలిస్తే..

Updated Date - Jun 08 , 2024 | 05:03 PM