Share News

Viral video: పులిని చూడగానే పారిపోయిన జింక.. ఆ వెంటనే వెనక్కు వచ్చి మరీ దాడి.. కారణమేంటో తెలిస్తే..

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:12 PM

పులులు, సింహాలను చూడగానే ఏ జంతువైనా పరుగులు పెడుతుందే గానీ.. దాన్ని ఎదురించే ధైర్యం మాత్రం చేయదు. అయితే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు వాటికి పరాజయం తప్పదు. మరికొన్నిసార్లు...

Viral video: పులిని చూడగానే పారిపోయిన జింక.. ఆ వెంటనే వెనక్కు వచ్చి మరీ దాడి.. కారణమేంటో తెలిస్తే..

పులులు, సింహాలను చూడగానే ఏ జంతువైనా పరుగులు పెడుతుందే గానీ.. దాన్ని ఎదురించే ధైర్యం మాత్రం చేయదు. అయితే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు వాటికి పరాజయం తప్పదు. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువుల చేతిలోనూ దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇంకొన్నిసార్లు పిల్లల జోలికి వెళ్లి తల్లి చేతిలో దెబ్బతినే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పులిని చూడగానే ఓ జింక పారిపోయింది. అయితే ఆ వెంటనే వెనక్కు వచ్చి మరీ దాడి చేసింది. కారణం ఏంటో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. తల్లి తన జోలికి వచ్చినా సహిస్తుందేమో గానీ.. తన పిల్లల జోలికి వస్తే మాత్రం అస్సలు సహించదు. అవసరమైతే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా తన పిల్లలను కాపాడుకుంటుంది. తాజాగా, ఓ జింక విషయంలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ జింక తన పిల్లతో కలిసి గడ్డి మేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో దూరం నుంచి చిరుతపులి వాటిని గమనిస్తుంది. వెంటనే వాటిపైకి దాడి దిగుతుంది.

Viral video: ఈ చిలుక డిజైనింగ్ మామూలుగా లేదుగా.. నిద్రపోతున్న వ్యక్తి జుట్టును ఎలా మార్చిందంటే..


పులి సమీపానికి రాగానే జింక భయంతో పారిపోతుంది. దీంతో ఆ చిరుతపులి అక్కడే ఉన్న జింక పిల్లపై దాడికి దిగుతుంది. దీన్ని గమనించిన తల్లి జింక.. వెనక్కు వచ్చి చిరుత పులిపై (Deer attack on leopard) ఎదురుదాడి చేస్తుంది. అప్పటిదాకా భయంతో ఉన్న జింక.. తన పిల్లకు ప్రాణహాని ఉందని తెలియగానే పెద్ద పులిగా మారుతుంది. దాని ఆవేశం చూసి చిరుత పులి కూడా భయంతో అక్కడి నుంచి పారిపోతుంది.

Puzzle: ఈ చిత్రంలో ఓ బ్లండర్ మిస్టేక్ ఉంది.. అదేంటో 20 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..


ఆ తర్వాత తన పిల్లను నోట కరుచుకున్న తల్లి జింక.. సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం’’.. అంటూ కొందరు, ‘‘ఈ జింకను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: ఇదెక్కడి ఐడియారా బాబోయ్..! బీరువా డోరు తీస్తే.. లోపల మీరెవరూ ఊహించని సీన్..

Updated Date - Jun 08 , 2024 | 04:12 PM