Share News

Viral video: నీటిలో తేలియాడుతున్న శవం.. బయటికి తీయాలని వెళ్లిన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:24 PM

చెరువు ఒడ్డున శవం పడి ఉండడం చూసి ప్రజలు భయాందోళన చెందారు. ఎవరో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని..

Viral video: నీటిలో తేలియాడుతున్న శవం.. బయటికి తీయాలని వెళ్లిన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

చెరువు ఒడ్డున శవం పడి ఉండడం చూసి ప్రజలు భయాందోళన చెందారు. ఎవరో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే నిమిత్తం చెరువు నుంచి బయటికి లాగారు. అయితే ఈ సందర్భంగా వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. తెలంగాణలోని (Telangana) హన్మకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక క్వారీలకు సమీపంలో ఉన్న చెరువు ఒడ్డున ఓ వ్యక్తి పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఆ వ్యక్తిలో ఎలాంటి కదలికలూ లేకపోవడంతో అంతా అతను చనిపోయాడని అనుకున్నారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని ఇంకొందరు అనుకున్నారు. చివరకు అంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు.

Viral video: పాము, ముంగిస పోరాటం.. పారిపోయి చిన్నారి ఊయల పైకి ఎక్కేసిన కోబ్రా.. చివరకు..


కాసేపటికి పోలీసులు అంబులెన్స్‌తో సహా అక్కడికి చేరుకున్నారు. ఓ కానిస్టేబుల్ మృతదేహాన్ని బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. చేయి పట్టుకుని ఇలా బయటికి లాగగానే.. చనిపోయాడనుకున్న వ్యక్తి కాస్తా.. ఒక్కసారిగా పైకి లేచాడు. పైగా నిద్రాభంగం చేసినందుకు వారిపై విసుక్కున్నాడు. దీంతో అప్పటిదాకా శవం అని అనుకున్న పోలీసులకు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకిలా చేశావంటూ అతన్ని ప్రశ్నించగా.. సమీపంలోని క్వారీలో పని చేస్తుంటానని చెప్పాడు.

Viral video: ఎంత వేడిగా ఉంటే మాత్రం బైకుపై ఇవేం ఏర్పాట్లురా బాబూ.. ఇలా ఎవరైనా చేస్తారా..


ఎండ వేడికి పని చేసి అలసిపోయానని, అందుకే ఇలా నీటిలో పడుకుని రెస్ట్ తీసుకుంటున్నానని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే అతడి వాలకం చూస్తుంటే మద్యం మత్తులో ఇలా చేసినట్లు అనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడు మామూలోడు కాదురోయ్’’.. అంటూ కొందరు, ‘‘ఆహా.. వాటెన్ ఐడియా సర్జీ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..

Updated Date - Jun 11 , 2024 | 04:24 PM