Share News

Viral video: మనిషిలా ప్రవర్తిస్తున్న మేక.. టీ గ్లాసు దగ్గర పెట్టగానే.. ఒక్కసారిగా..

ABN , Publish Date - Jun 09 , 2024 | 07:28 PM

కోతులు, చింపాంజీలు మనుషులను అనుకరిస్తూ.. మనుషులు చేసే పనులను చేస్తూ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే..

Viral video: మనిషిలా ప్రవర్తిస్తున్న మేక.. టీ గ్లాసు దగ్గర పెట్టగానే.. ఒక్కసారిగా..

కోతులు, చింపాంజీలు మనుషులను అనుకరిస్తూ.. మనుషులు చేసే పనులను చేస్తూ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే మేకలు, గొర్రెలు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఓ మేక మనిషిలా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీ గ్లాసు దగ్గర పెట్టగానే మేక ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మేక ఇంటి గుమ్మంలో పడుకుని ఉంటుంది. దేని కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంటుంది. ఇంతలో దాని యజమాని టీ గ్లాసు తీసుకుని మేక వద్దకు వెళ్లింది. టీ గ్లాసు ఇలా మేక వద్ద పెట్టగానే.. వెంటనే మేక తన నోటితో టీ గ్లాసును అందుకుంటుంది. అది కూడా మనిషిలాగానే (goat drank tea like a man) గ్లాసు నోటితో పైకి ఎత్తి తాగేస్తుంది.

Viral video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం.. కరవరానిచోట కరచిన పాము.. చివరకు..


తర్వాత అక్కడున్న మహిళ మేకకు టీ తాగించడం కూడా వీడియోలో చూడొచ్చు. ఆమె మాట్లాడుతూ ఈ మేకకు ఏది తినాలన్నా ముందు టీ తాగడం అలవాటు అని చెప్పింది. టీ తాగకుండా ఏదీ తినదట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మేకకు టీ పిచ్చి ఎక్కువున్నట్లుందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా విచిత్రంగా ఉందే’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..

Updated Date - Jun 09 , 2024 | 07:28 PM