Share News

Viral video: కుక్కను మిమిక్రీతో భయపెట్టిన చిలుక.. ఇంట్లోకి రాకుండా ఎలా అడ్డుకుందో చూడండి..

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:38 PM

కుక్కలు, కోతులు, పిల్లులు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూశాం. అప్పుడప్పుడూ అవి మిగతా జంతువుల్లా అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన..

Viral video: కుక్కను మిమిక్రీతో భయపెట్టిన చిలుక.. ఇంట్లోకి రాకుండా ఎలా అడ్డుకుందో చూడండి..

కుక్కలు, కోతులు, పిల్లులు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూశాం. అప్పుడప్పుడూ అవి మిగతా జంతువుల్లా అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే పక్షులు జంతువులను అనుకరించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్కను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న చిలుక.. దాన్ని మిమిక్రీతో భయపెట్టడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిలుక వినూత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ కుక్క ఇంట్లోకి రావడం చూసి చిలుక అడ్డుకుంది. మామూలుగా అడ్డుకుంటే కుక్క భయపడదనే ఉద్దేశంతో.. విచిత్రంగా ప్రవర్తించింది. ఏకంగా కుక్కలా మొరుగుతూ ఇంట్లోకి వస్తున్న కుక్కను భయపెట్టింది. అచ్చం కుక్కలా (parrot barks like dog) మొరగడంతో ఇంట్లోకి వెళ్తున్న కుక్క .. సడన్‌గా ఆగిపోయింది.

Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..


చిలుక కుక్కలా మొరగడం చూసి భయపడిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలాగే నిలబడిపోయింది. చిలుక చాలా సేపు మొరుగుతూ ఆ కుక్కను భయపెట్టింది. ఈ ఘటనను ఆ ఇంటి యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదేంటీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం కుక్కలా మొరుగుతోంది.. ఇది చాలా ఫన్నీ చిలుకలా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం.. కరవరానిచోట కరచిన పాము.. చివరకు..

Updated Date - Jun 09 , 2024 | 05:38 PM