Share News

Viral video: పులి నుంచి తప్పించుకోవడానికి కొండముచ్చుల పక్కా స్కెచ్.. సడన్‌గా ఎటాక్ చేయడంతో చివరకు..

ABN , Publish Date - Jun 08 , 2024 | 08:48 PM

పులుల దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారిగా అవి వేటను టార్గెట్ చేశాయంటే.. తరిమి తరమి పంజా విసురుతుంటాయి. వాటి పంజా దెబ్బకు ఎలాంటి జంతువైనా ప్రాణాలు వదలాల్సిందే. కొన్నిసార్లు...

Viral video: పులి నుంచి తప్పించుకోవడానికి కొండముచ్చుల పక్కా స్కెచ్.. సడన్‌గా ఎటాక్ చేయడంతో చివరకు..

పులుల దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారిగా అవి వేటను టార్గె్ట్ చేశాయంటే.. తరిమి తరమి పంజా విసురుతుంటాయి. వాటి పంజా దెబ్బకు ఎలాంటి జంతువైనా ప్రాణాలు వదలాల్సిందే. కొన్నిసార్లు ఈ పులులు కోతులు, కుక్కలు, కోళ్లను వేటాడటం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చిరుత పులి దాడి నుంచి తప్పించుకోవడానికి కొండముచ్చులు పక్క స్కెచ్ ప్రకారం ప్రయత్నించాయి. అయితే సడన్‌గా చిరుత ఎంట్రీ ఇవ్వడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో చాలా కొండముచ్చులు గుంపులుగా ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఆ సమయంలో ఓ చిరుత పులి అటుగా వస్తుంది. కొండముచ్చులను దూరం నుంచి టార్గెట్ చేసిన చిరుత.. దాడి చేసేందుకు దారి పక్కనే పొంచి ఉంది. దీన్ని గమనించిన కొండముచ్చులు ఎలాగైనా పులిని తప్పించుకుని వెళ్లిపోవడానికి అన్నీ కలిసి పక్కా స్కెచ్ గీసుకున్నాయి. గుంపులుగా ఉన్న కొండముచ్చులు.. ఒకదాని వెనుక మరోటి వేగంగా పారిపోయి రోడ్డు దాటాలని డిసైడ్ అయ్యాయి.

Viral video: పులిని చూడగానే పారిపోయిన జింక.. ఆ వెంటనే వెనక్కు వచ్చి మరీ దాడి.. కారణమేంటో తెలిస్తే..


అనుకున్న ప్రకారం అన్నీ ఒకదాని వెనుక మరోటి రోడ్డు అవతలి వైపునకు పరుగులు తీశాయి. అయితే ఉన్నట్టుంది చిరుత పులి ఎంటర్ అయింది. చివరగా రోడ్డు దాటుతున్న కొండముచ్చులపైకి పులి దూసుకెళ్లింది. పొదల్లోకి దూరిన (Tiger attack on Baboon) కొండముచ్చును నోట కరుచుకుని పక్కకు తీసుకెళ్లింది. తమ స్నేహితుడిపై పులి దాడి చేయడాన్ని గమనించిన కొండముచ్చులు.. మళ్లీ వెనక్కు వచ్చి చిరుతపై దాడి చేయాలని ప్రయత్నించాయి.

Viral video: కారు నంబర్ ప్లేటు తీసి చూడగా.. లోపల షాకింగ్ సీన్.. ఈ డ్రైవర్ తెలివితేటలు మామూలుగా లేవుగా..


ఎలాగైనా తమ స్నేహితుడిని విడిపించుకుపోవాలని శతవిధాలా ప్రయత్నించాయి. అయితే అప్పటికే ఆ కొండముచ్చు ప్రాణం పోయింది. దీనికితోడు చిరుత పులి మిగతా కొండముచ్చులపైకి కూడా దాడికి దిగడంతో అన్నీ భయంతో పారిపోయాయి. ఇలా చాలా సేపు తమ సహచురిడిని కాపాడుకోవాలని ప్రయత్నించినా... వాటి వల్ల సాధ్యం కాలేదు. ఈ ఘటనను అక్కడే వాహనాల్లో ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral video: రాళ్లను పగులగొడుతుండగా కలిసొచ్చిన అదృష్టం.. అడుగున అనుమానాస్పదంగా ఉండడంతో..

Updated Date - Jun 08 , 2024 | 08:48 PM