Share News

Viral video: చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. తీరా చూస్తే కాళ్లను చుట్టేసిన పాము.. చివరకు..

ABN , Publish Date - Jun 12 , 2024 | 08:36 PM

పాములు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు ఫ్రిడ్జి డోర్ల నుంచి బయటికి వస్తే.. మరికొన్నిసార్లు మంచాల కింద నుంచి వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా షూల నుంచి బయటికి వచ్చి బుసలుకొడుతుంటాయి. ఇలాంటి..

Viral video: చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. తీరా చూస్తే కాళ్లను చుట్టేసిన పాము.. చివరకు..

పాములు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు ఫ్రిడ్జి డోర్ల నుంచి బయటికి వస్తే.. మరికొన్నిసార్లు మంచాల కింద నుంచి వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా షూల నుంచి బయటికి వచ్చి బుసలుకొడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెట్టు కింద కూర్చుని హాయిగా నిద్రపోతుంటాడు. ఇంతలో ఓ పాము వచ్చి అతడి కాళ్లను చుట్టేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెట్టు కింద కూర్చుని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. నిద్రపోతున్న ఆ వ్యక్తి వద్దకు ఓ పెద్ద పాము వస్తుంది. వచ్చిన పాము వెళ్లకుండా ఏకంగా అతడి కాళ్లను చుట్టేస్తుంది. రెండు కాళ్లను (snake wrapped around legs) చుట్టేసిన పాము చివరకు మెల్లిగా అతడి పైకి ఎగబాకేందుకు ప్రయత్నిస్తుంది.

Viral video: నిర్మానుష్యమైన బీచ్‌లో చిక్కుకుపోయిన వ్యక్తి.. గుళకరాళ్ల సాయంతో ఎలా బయటపడ్డాడంటే..


పాము ఒంటిపైకి పాకడంతో అతడికి ఒక్కసారిగా మెలకువ వచ్చేస్తుంది. కళ్లు తెరచిన అతను కాళ్లను చుట్టేసిన పామును చూసి ఖంగుతింటాడు. భయంతో వణుకుతూ కేకలు వేస్తాడు. దీంతో పాకుతూ పైకి వెళ్తున్న పాము కాస్త.. భయంతో పక్కకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral video: ఇతనేమైనా.. సూపర్ మ్యాన్ అనుకున్నాడేమో.. రెండు రైళ్ల మధ్య ఎలాంటి స్టంట్ చేశాడంటే..


ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’.., ‘‘ఆ పాము విషపూరితం కాదనుకుంటా’’.., ‘‘చూస్తున్న వారు వీడియో తీయకుంటే.. వెళ్లి కాపాడొచ్చుగా’’.., ‘‘ఇదంతా వ్యూస్ కోసం కావాలనే చేసినట్లుగా అనిపిస్తోంది’’.., ‘‘రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: అప్పగింతల సమయంలో అందరికీ షాక్ ఇచ్చిన వధువు.. చివరకు చుట్టూ అంతా చేరి..

Updated Date - Jun 12 , 2024 | 08:36 PM