Share News

Viral video: ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని.. ఈ పోలీసు ఎలా కాపాడాడో చూస్తే..

ABN , Publish Date - Jun 12 , 2024 | 06:38 PM

ఆపద సమయాల్లో కొందరు ఆపద్బాంధవుల్లా వచ్చి కాపాడడం చూస్తుంటాం. కొందరు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చి కూప్పకూలిపోతుంటారు. అదే సమయంలో ఎవరో ఒకరు దేవుడిలా వచ్చి వారికి సీపీఆర్ చేసి బతికించడాన్ని చూస్తుంటాం. అలాగే...

Viral video: ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని.. ఈ పోలీసు ఎలా కాపాడాడో చూస్తే..

ఆపద సమయాల్లో కొందరు ఆపద్బాంధవుల్లా వచ్చి కాపాడడం చూస్తుంటాం. కొందరు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ వచ్చి కూప్పకూలిపోతుంటారు. అదే సమయంలో ఎవరో ఒకరు దేవుడిలా వచ్చి వారికి సీపీఆర్ చేసి బతికించడాన్ని చూస్తుంటాం. అలాగే బస్సులో నుంచి రోడ్డు పైకి పడపోతున్న వ్యక్తిని తక్షణమే స్పందించి కాపాడిన కండక్టర్‌ను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నెలల వయసున్న ఓ చిన్నారి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటుంది. అంతలో అటుగా వచ్చిన పోలీసు.. శిశువు ప్రాణాలు ఎలా కాపాడడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని (America) మిచిగాన్‌లో 2020లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది. ఓ గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. అయితే పుట్టిన శిశువు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. ఎంత ప్రయత్నించినా చిన్నారి (baby) ఊపిరి తీసుకోకపోవడంతో చివరకు సమీపంలో ఉన్న పోలీసుల వద్దకు వెళ్లారు. శిశువు పరిస్థితిని గమనించిన ఓ పోలీసు (police) అధికారి చేతిలోకి తీసుకున్నాడు.

Viral: ఖరీదైన హోటల్లో గది బుక్ చేసుకున్న మహిళ.. ఉదయం లేవగానే తన ఒంటిపై చూసుకోగా.. షాకింగ్ సీన్..


శిశువును చేతిపై బోర్లాపడుకోబెట్టి కిందకు, పైకి ఊపుతాడు. అలాగే కడుపుపై సున్నితంగా నొక్కుతూ ప్రథమ చికిత్స అందిస్తాడు. ఇలా చాలా సేపు చేసేసరికి చిన్నారి ఊపిరి తీసుకుంటుంది. ఇలా ఆ పోలీసు సమయానికి ఆపద్బాంధవుడిలా వచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ పోలీసుల నిజంగా దేవుడిలా వచ్చాడు’’.. అంటూ కొందరు, ‘‘చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral video: పట్టుకోబోతుండగా కాటేసిన పాము.. అయినా భయపడని స్నేక్ క్యాచర్.. చివరకు..

Updated Date - Jun 12 , 2024 | 06:38 PM