Share News

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న సూదిని 30 సెకన్లలో గుర్తిస్తే.. మీకు కళ్లద్దాలతో పని లేనట్లే..

ABN , Publish Date - Jun 11 , 2024 | 09:40 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో పైకి ఒకటి కనిపిస్తే లోపల ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు వెతకడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఇలాంటి వాటికి...

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న సూదిని 30 సెకన్లలో గుర్తిస్తే.. మీకు కళ్లద్దాలతో పని లేనట్లే..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో పైకి ఒకటి కనిపిస్తే లోపల ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు వెతకడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఇలాంటి వాటికి సమాధానాలు కనుక్కునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తుంటారు. వీటిలో కొన్ని పజిల్ ఫొటోలకు సమాధానాలు గుర్తించడం చాలా కష్ంటా ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో సమాధానాల కోసం ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. తాజాగా, మీ కోస ఇలాంటి ఫొటో ఒకటి తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాగి ఉన్న సూదిని 30 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి...


సోషల్ మీడియాలో ఓ పజిల్ చిత్రం (Puzzle viral news) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ బాలిక, మరో బాలుడు కలిసి ఆక్వేరియంలో ఉన్న చేపలకు ఆహారం వేస్తున్నారు. వారి పక్కనే పెంపుడు కుక్క ఆసక్తిగా గమనిస్తోంది. అలాగే వారి వెనుక ఉన్న కిటికీ నుంచి రెండు సింహాలు కూడా వీరిని తదేకంగా గమనిస్తున్నాయి. వారి ఇంటి కిటికీ వెనుక చాలా చెట్లు కనిపిస్తుంటాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం.

Viral video: ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. పడగ విప్పిన పాముకు ముద్దులు పెట్టిన కుక్కపిల్ల.. చివరకు..


ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ సూది (hidden needle) దాక్కుని ఉంది. దాన్ని 30 సెకన్లలో గుర్తించగలరేమో ప్రయత్నించండి. చాలా మంది సూదిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చూపు తీక్షణంగా ఉన్న వారు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ప్రయత్నించండి. 30 సెకన్ల లోపు గుర్తిస్తే మీ చూపు కూడా చాలా పవర్ ఫుల్ అని అర్థం. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆ సూదిని కనిపెట్టలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

puzzle-viral-trending-news.jpg

Viral: ఖరీదైన హోటల్లో గది బుక్ చేసుకున్న మహిళ.. ఉదయం లేవగానే తన ఒంటిపై చూసుకోగా.. షాకింగ్ సీన్..

Updated Date - Jun 11 , 2024 | 09:40 PM