Viral Video: రోడ్డుపై చెరుకు బండిని ఫాలో చేసిన బైకర్.. దగ్గరికి వెళ్లాక రైతు రియాక్షన్ చూస్తే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 01:55 PM
సాయం చేయాలనే గుణం ఉండాలే గానీ.. ఏ స్థాయిలో ఉన్న వారైనా సాటి వారికి ఎంతో కొంత సాయం చేయొచ్చు. చాలా మంది పేద వారు తాము ఇబ్బంది పడుతున్నా కూడా ఎదుటి వారికి ఎంతో కొంత సాయం చేయడం చూస్తుంటాం. ఇలాంటి వారిని చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా..
సాయం చేయాలనే గుణం ఉండాలే గానీ.. ఏ స్థాయిలో ఉన్న వారైనా సాటి వారికి ఎంతో కొంత సాయం చేయొచ్చు. చాలా మంది పేద వారు తాము ఇబ్బంది పడుతున్నా కూడా ఎదుటి వారికి ఎంతో కొంత సాయం చేయడం చూస్తుంటాం. ఇలాంటి వారిని చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బైకర్ చెరుకు బండిని ఫాలో అవుతూ వెళ్లాడు. అయితే దగ్గరగా వెళ్లగా బండిపై ఉన్న రైతు ప్రతిస్పందన చూసి ఫిదా అయ్యాడు. ఈ వీడియో చూసిన వారంతా.. రైతును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్‌కు చెరుకు (sugarcane) లోడుతో వెళ్తున్న ఎద్దుల బండి (Bullock cart) కనిపిస్తుంది. రైతు (farmer) కుటుంబ సభ్యులు చెరుకు లోడుపై కూర్చుని వెళ్లడం చూసి వీడియో తీస్తాడు. అలా వీడియో తీసుకుంటూ ఆ బండిని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇలా కొద్దిసేపటికి చెరుకు బండి దగ్గరగా వెళ్లి వారిని వీడియో తీస్తుంటాడు.
ఈ క్రమంలో తినడానికి చెరుకు ఇస్తారా అని ఎద్దుల బండిని నడుపుతున్న వ్యక్తిని అడుగుతాడు. ఆ బైకర్ (Biker) ఇలా అడగ్గానే ఆ రైతు కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే ఓ చెరుకు గడను విరిచి అతడికి ఇచ్చేస్తాడు. ఆ రైతు మంచితనాన్ని చూసి బైకర్ ఫిదా అవుతాడు. తర్వాత అతను ఆ రైతుకు ధన్యవాదాలు తెలియజేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాగా, ఈ ఘటనను మొత్తం వీడియో తీసిన అతను.. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
Viral Video: రోడ్డుపై సింహం.. అయ్యో పాపం అంటున్న జనం..
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు రైతును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఆ రైతు ధనంలో పేదవాడైనా.. సేవాగుణంలో మాత్రం కాదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ఇంకా మానవత్వం మిగిలి ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 64 వేలకు పైగా లైక్‌లు, 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..