Share News

Optical illusion: ఈ అడవిలో ఓ యాపిల్ దాక్కుని ఉంది.. దాన్ని గుర్తించడం మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి..

ABN , Publish Date - Feb 25 , 2024 | 03:39 PM

ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటో ఫజిల్స్ తదితరాలు అందరికీ తెగ ఆసక్తి కలిగిస్తుంటాయి. వాటిని పరిష్కరించేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి..

Optical illusion: ఈ అడవిలో ఓ యాపిల్ దాక్కుని ఉంది.. దాన్ని గుర్తించడం మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి..

ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటో ఫజిల్స్ తదితరాలు అందరికీ తెగ ఆసక్తి కలిగిస్తుంటాయి. వాటిని పరిష్కరించేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం నెట్టింట్లో ఇలాంటి ఫొటోలు, వీడియోలు అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకదాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న అడవిలో ఓ పెద్దాయన.. ఇద్దరు పిల్లలను తీసుకుని పండ్లు ఏరుకుంటూ వెళ్తున్నాడు. అయితే వాళ్లకు కనిపించకుండా ఓ యాపిల్ పండు దాక్కుని ఉంది. దాన్ని మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో ఓ పెద్దాయన.. ఇద్దరు చిన్న పిల్లలు నడుస్తూ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ అక్కడ దొరికే పండ్లు ఏరుకుంటూ వెళ్తున్నారు. వారితో పాటూ ఓ పెంపుడు కుక్క కూడా ఉంది. అలాగే అటు పక్కన అడవి పంది, కుందేలు తదితర జంతువులు కూడా తిరుగుతున్నాయి. వారి వెనుక పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి.

Viral Video: వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. వందల కొద్దీ టమాటాలను.. ఒక్క వేటుతో..

అయితే ఈ సమూహంలో వారికి కనిపించకుండా ఓ యాపిల్ (Apple) పండు దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టడం వారి వల్ల కాలేదు. చాలా మంది నెటిజన్లు.. ఆ యాపిల్ పండును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కొందరు సక్సెస్ అవుతున్నారు.. మరికొందరు విఫలమవుతున్నారు. ఆ పండు ఎక్కడుందో గుర్తించేందుకు.. ఓ సారి మీరు కూడా ప్రయత్నించండి. దాన్ని గుర్తిస్తే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం. ఒకవేళ యాపిల్ పండును గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి అదెక్కడుందో తెలుసుకోవచ్చు.

Viral Video: కోతుల దెబ్బంటే ఎలా ఉంటుందో.. ఈ పులికి నడి రోడ్డుపైనే చూపించాయిగా..

optical-illusion-viral.jpg

Updated Date - Feb 25 , 2024 | 03:39 PM