Share News

Viral video: ఓరి దీని వేషాలో..! మాంసం కోసం ఎలుగుబంటి ఎదుట ఈ తోడేలు విన్యాసాలు చూస్తే..

ABN , Publish Date - Jun 13 , 2024 | 05:01 PM

జంతువుల మధ్య కొన్నిసార్లు భయంకర పోరాటాలు జరిగితే.. మరికొన్నిసార్లు విచిత్ర ఘటనలు, ఇంకొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఆహార కోసం చాలా జంతువులు చిత్రవిచిత్ర సహసాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral video: ఓరి దీని వేషాలో..! మాంసం కోసం ఎలుగుబంటి ఎదుట ఈ తోడేలు విన్యాసాలు చూస్తే..

జంతువుల మధ్య కొన్నిసార్లు భయంకర పోరాటాలు జరిగితే.. మరికొన్నిసార్లు విచిత్ర ఘటనలు, ఇంకొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఆహార కోసం చాలా జంతువులు చిత్రవిచిత్ర సహసాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ తోడేలు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మాంసం కోసం ఓ తోడేలు.. ఎలుగుబంటి ఎదుట ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఎలుగుబంటి, తోడేళ్ల మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఎలుగుబంటి (bear) ఓ జంతువును వేటాడి చెరువు ఒడ్డున తింటూ ఉంటుంది. ఎలుగు బంటి మాంసం తినడాన్ని గమనించిన తోడేళ్లు (wolf) పరుగెత్తుకుంటూ దగ్గరికి వస్తాయి. అయితే ఎలుగుబంటి వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూరంగా తరిమేస్తుంది.

Viral video: చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. తీరా చూస్తే కాళ్లను చుట్టేసిన పాము.. చివరకు..


అయితే తోడేలు మాత్రం ఎలాగైనా ఆహారం సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడే వేచి చూస్తూ ఉంటుంది. అయినా ఎలుగుబంటి మాత్రం దాన్ని దగ్గరికి కూడా రానివ్వదు. దీంతో తోడేలు ఎలుగుబంటి మనసును చూరగొనేందుకు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంది. అటూ, ఇటూ గెంతుతూ.. మధ్య మధ్యలో నక్కి నక్కి చూస్తూ ఎలుగుబంటి (wolf strang behaving for meat) ఎదుట వింత వింత ప్రవర్తిస్తుంది. దీంతో అయినా ఎలుగుబంటి మనసు కరిగి ఓ మాంసం ముక్క అయినా ఇస్తుందని ఆశపడుతుంది.

Viral video: వధువు ఎదుటే వరుడితో ఆటలు.. చిర్రెత్తుకొచ్చిన పెళ్లికొడుకు చివరకు..


అయితే ఎలుగు బంటి మాత్రం దానికి ఒక్క పీస్ కూడా ఇవ్వకుండా మొత్తం తినేస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ తోడేలు వేషాలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘తోడేలును చూస్తుంటే నవ్వొస్తోంది’’.. అంటూ ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: ఇదెలా సాధ్యం.. రాళ్లు పగులగొట్టగా మధ్యలో ఇతడికి దొరికిన వస్తువులేంటో చూడండి..

Updated Date - Jun 13 , 2024 | 05:01 PM