Share News

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీరా నాయనా..! బియ్యం బస్తాపై ఇలాంటి ప్రయోగం కూడా చేయొచ్చా..

ABN , Publish Date - May 17 , 2024 | 05:42 PM

కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చేసే పనులు.. కొన్నిసార్లు అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన జరిగినా, విచిత్ర ప్రయోగం చేసినా.. అందుకు...

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీరా నాయనా..! బియ్యం బస్తాపై ఇలాంటి ప్రయోగం కూడా చేయొచ్చా..

కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చేసే పనులు.. కొన్నిసార్లు అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఎలాంటి విచిత్ర ఘటన జరిగినా, విచిత్ర ప్రయోగం చేసినా.. అందుకు సంబంధించిన వీడియోలు ఇట్టే సోషల్ మీడియాలోకి వచ్చి చేరుకుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బియ్యం బస్తాపై చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదెక్కడి క్రియేటివిటీరా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అతి తెలివిగా ఆలోచించి చేసిన పని చూసి అంతా నెటిజన్లు అవాక్కవుతున్నారు. సదరు యువకుడు తన ఇంట్లోని బియ్యం బస్తాపై వినూత్న ప్రయోగం చేశాడు. సాధారణంగా అన్నం వండాలంటే మూటను విప్పి, అందులోని బియ్యం బయటికి తీయడం సాధారణం. ఇదంతా పెద్ద పని అనుకున్నాడో ఏమో గానీ.. ఈ యువకుడు విచిత్రంగా ఆలోచించాడు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న పిల్లాడిని గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..


బియ్యం బస్తాకు ఏకంగా కొళాయి తరహాలో ఏర్పాట్లు చేశాడు. ప్లాస్టిక్ బాటిల్ (Plastic bottle) మూత ఉన్న భాగాన్ని కోసేసి, దాన్ని బస్తా కింది భాగంలో అమర్చాడు. మూత భాగం బయటికి కనిపించేలా ఏర్పాటు చేశాడు. ఫైనల్‌గా మూత తీయగానే బాటిల్ రంధ్రం నుంచి బియ్యం నీళ్ల తరహాలో వచ్చి పాత్రలో పడుతున్నాయి. తనకు అవసరమైన బియ్యం బయటికి రాగానే.. నీళ్ల కొళాయిని కట్టేసినట్లే బియ్యం కొళాయికి కూడా మూత పెట్టేశాడు.

Viral Video: ఏనుగు తొండాన్ని పట్టుకున్న మొసలి.. చివరకు ఎలా తప్పించుకుందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వావ్..! ప్రయోగం అదిరింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత పెళ్లి అయితే మాత్రం మరీ ఇదేంటీ.. ఈ వరుడి డాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 17 , 2024 | 05:42 PM