Share News

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

ABN , Publish Date - May 11 , 2024 | 04:16 PM

పెళ్లిళ్లు అంటే పందిళ్లు, సందళ్లు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు.. అని ఓ సినీ కవి అన్నట్లుగా పెళ్లిళ్లలో సండితో పాటూ సరదా కూడా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. అయితే ఒకప్పటి పెళ్లిళ్లతో పోలిస్తే.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్ల నిర్వహణలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులోనూ...

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

పెళ్లిళ్లు అంటే పందిళ్లు, సందళ్లు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు.. అని ఓ సినీ కవి అన్నట్లుగా పెళ్లిళ్లలో సండితో పాటూ సరదా కూడా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. అయితే ఒకప్పటి పెళ్లిళ్లతో పోలిస్తే.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్ల నిర్వహణలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్లలపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటోంది. దీంతో పది మంది మధ్య జరిగే పెళ్లి కాస్తా.. కొన్నిసార్లు ప్రపంచం దృష్టిలో పడుతోంది. పెళ్లిళ్లలో చోటు చేసుకునే తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. వేదికపై వరుడు తన మరదిలితో కలిసి డాన్స్ చేశాడు. ఓపిగ్గా చూసిన వధువు చివరకు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వేదికపై సరదా సంఘటన చోటు చేసుకుంది. దండలు మార్చుకున్న వధూవరులిద్దరూ సోఫాలో కూర్చుని ఉండగా.. వరుడి మరదలు పైకి వెళ్తుంది. తనతో కలిసి డాన్స్ చేయాలని కోరడంతో (groom danced with sister in law) వరుడు కూడా ఓకే చెప్పేస్తాడు. ఇద్దరూ కలిసి భోజ్‌పురి పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తారు. వీరి డాన్స్‌ను అంతా ఆసక్తిగా చూస్తుంటారు. వారితో పాటూ వధువు కూడా చాలా ఓపిగ్గా చూస్తూ ఉంటుంది. అయితే మధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: అయ్యో..! కోతిని పట్టుకుని ఎంతకీ వదలని పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఓ వ్యక్తి పెళ్లి వేదిక పైకి వెళ్లి.. తనతో డాన్స్ వేయాలని వధువును కోరతాడు. అప్పటిదా సైలెంట్‌గా ఉన్న వధువు.. ఆ వ్యక్తి కోరిక మేరకు సోఫాలో నుంచి పైకి లేచి డాన్స్ మొదలెడుతుంది. ఓ వైపు వరుడు తన మరదలితో డాన్స్ చేస్తుంటే.. మరోవైపు వధువు తనకు బావ వరుసయ్యే వ్యక్తితో డాన్స్ చేస్తుంది. వీరి డాన్స్‌ను అంతా ఆసక్తిగా చూస్తూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘డాన్స్ అదరగొట్టారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..

Updated Date - May 11 , 2024 | 04:23 PM