Share News

Viral Video: పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడికి షాక్ ఇచ్చిన యువకుడు.. చివరకు..

ABN , Publish Date - May 09 , 2024 | 08:45 PM

వివాహ కార్యక్రమాల్లో తమాషా సంఘటనలతో పాటూ అప్పుడప్పుడూ సీరియస్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తీరా తాళి కట్టే సమయంలో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ...

Viral Video: పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడికి షాక్ ఇచ్చిన యువకుడు.. చివరకు..

వివాహ కార్యక్రమాల్లో తమాషా సంఘటనలతో పాటూ అప్పుడప్పుడూ సీరియస్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తీరా తాళి కట్టే సమయంలో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలతో చివరకు పెళ్లిళ్లే క్యాన్సిల్ అవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చి వరుడికి షాక్ ఇచ్చాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధువు (bride) వేదికపై ఉండగా కాసేపటికి వరుడు (groom) కూడా వేదికపైకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ యువకుడు ఉన్నట్టుండి అక్కడికి దూసుకొచ్చి వేదికపైకి ఎక్కేస్తాడు. యువకుడు ఇలా సడన్‌గా వేదిక పైకి రావడం చూసి వరుడు షాక్ అవుతాడు. వధువును తాను ముందే ప్రేమించానంటూ వేదికపైనే చెప్పడంతో అంతా అవాక్కవుతారు.

Viral Video: అదృష్టమంటే ఇతడితే.. బెంచిపై కూర్చుని ఉండగా.. ఏం జరిగిందో చూడండి..


అతను మాట్లాడుతున్నంత సేపూ వరుడితో పాటూ పెళ్లికి వచ్చిన అతిథులంతా అలా చూస్తుండిపోతారు. వేదికపై నిల్చున్న యువకుడు.. ఇలా చాలా సేపు అక్కడే నిలబడి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. చూస్తుంటే ఇదంతా కావాలని ప్లాన్ చేసి తీసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీన్ చూస్తుంటే సినిమా చూసినట్లు ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రాంక్ వీడియో చాలా బాగుంది’’.. అంటూ మరికొదంరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రాణాలు తీసే ఏకే47తో.. ఇలాంటి వింత ప్రయోగం ఎక్కడైనా చూశారా..

Updated Date - May 09 , 2024 | 08:45 PM