Share News

Viral Video: అదృష్టమంటే ఇతడితే.. బెంచిపై కూర్చుని ఉండగా.. ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - May 09 , 2024 | 06:11 PM

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కొందరు తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి...

Viral Video: అదృష్టమంటే ఇతడితే.. బెంచిపై కూర్చుని ఉండగా.. ఏం జరిగిందో చూడండి..

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కొందరు తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బెంచిపై కూర్చుని ఉండగా.. అరటి చెట్లు కూలిపడ్డాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఫిలిప్పీన్స్‌లోని (Philippines) కావిట్ సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆరు బయట ఉన్న బెంచిపై కూర్చుని ఉంటాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అతడి వెనుక ఉన్న రెండు పెద్ద అరటి చెట్లు (banana trees) ఒక్కసారిగా కూలి బెంచిపై పడతాయి. అయితే సరిగ్గా కూర్చున్న వ్యక్తికి అటూ, ఇటూ పడిపోతాయి. రెండు అరటి చెట్లు అతడి తలకు రెండు వైపులా అత్యంత సమీపంలో పడిపోతాయి. ఒకవేళ అతడి తలపై పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

Viral: ఫోన్‌లో మాట్లాడుతూ పువ్వును పీకేసిన యువతి.. ఆ మరుక్షణమే..


అరటి చెట్లు పడగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే తనకు ఏమీ కాకపోవడంతో.. హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అదష్టం అంటే ఇతడిదే’’.. అంటూ కొందరు, ‘‘తృటిలో తప్పిన పెను ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: అరే.. ఇదేంటీ..! పామును ఇలాక్కూడా పట్టొచ్చా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

Updated Date - May 09 , 2024 | 06:11 PM