Share News

Viral Video: తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - May 09 , 2024 | 10:18 PM

నదుల్లో చేపల వేట సమయంలో కొన్నిసార్లు, చేపలు ఆహారం వేస్తున్న సమయంలో మరికొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. చేప కోసం వల వేస్తే.. దాని వెంటే మొసలి బయటికి రావడం, చేపల వలలో...

Viral Video: తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూస్తే..

నదుల్లో చేపల వేట సమయంలో కొన్నిసార్లు, చేపలు ఆహారం వేస్తున్న సమయంలో మరికొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. చేప కోసం వల వేస్తే.. దాని వెంటే మొసలి బయటికి రావడం, చేపల వలలో వాటికి బదులుగా ఏవేవో జంతువులు కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి చేపలు, తాబేళ్లకు ఆహారం వేస్తుండగా.. మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) నది ఒడ్డున మెట్లపై కూర్చుని చేపలు, తాబేళ్లకు ఆహారం వేస్తూ ఉంటుంది. కొన్ని చేపలు, తాబేళ్లు అక్కడ గుమికూడి ఆహారం తింటుంటాయి. అయితే అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కొమొడో డ్రాగన్ (Komodo dragon) సడన్‌గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. వచ్చీ రావడంతోనే తాబేళ్లు, చేపలపై దాడి చేస్తుంది.

Viral Video: పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడికి షాక్ ఇచ్చిన యువకుడు.. చివరకు..


తర్వాత యువతి వేసిన ఆహారం కోసం అక్కడే వేచి ఉంటుంది. కొమొడో డ్రాగన్ రాకతో యువతి భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. కాస్త ఆలస్యం అయ్యుంటే.. పెద్ద ప్రమాదం జరిగేదే’’.. అంటూ కొందరు, ‘‘యువతికి పెద్ద షాకే ఇచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రాణాలు తీసే ఏకే47తో.. ఇలాంటి వింత ప్రయోగం ఎక్కడైనా చూశారా..

Updated Date - May 09 , 2024 | 10:18 PM