Share News

Viral Video: అయ్యో..! కోతిని పట్టుకుని ఎంతకీ వదలని పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - May 10 , 2024 | 08:59 PM

కోతి చేష్టలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అవతల ఉన్నది ఎలాంటి జంతువైనా సరే.. ముందు, వెనుకా చూడకుండా అదేపనిగా కెలుకుతుంటాయి. పులులు, సింహాలతో ఎకసెక్కాలాడే కోతులను చూశాం, కుక్కలు, పందులు, మేకలు ఇలా అనేక రకాల జంతువులతో...

Viral Video: అయ్యో..! కోతిని పట్టుకుని ఎంతకీ వదలని పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

కోతి చేష్టలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అవతల ఉన్నది ఎలాంటి జంతువైనా సరే.. ముందు, వెనుకా చూడకుండా అదేపనిగా కెలుకుతుంటాయి. పులులు, సింహాలతో ఎకసెక్కాలాడే కోతులను చూశాం, కుక్కలు, పందులు, మేకలు ఇలా అనేక రకాల జంతువులతో స్నేహం చేసే కోతులను చూశాం. పర్యాటకుల వస్తువులు ఎత్తుకెళ్లి తనకు కావాల్సిన ఆహార పదార్థాలు తీసుకుని, తిరిగి వారి వస్తువులు వెనక్కు ఇచ్చే కోతులను కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పాము, కోతి వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాము కోతిని పట్టుకుని అస్సలు వదల్లేదు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొబ్బరి చెట్టు పైకి ఎక్కిన ఓ కోతికి చెట్టు తొర్రలో ఓ పాము కనిపిస్తుంది. పామును చూడగానే కోతి.. తొర్రలోకి దూరి మరీ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. ముట్టుకోగానే పాము బుసలు కొడుతూ కోతి పైకి దాడికి దిగింది. ఈ క్రమంలో (snake bit the monkey) కోతి తలపై కాటు వేసింది. దీంతో షాకైన కోతి.. విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. పామును పట్టుకుని అటూ, ఇటూ లాగుతుంది. అయినా పాము కోతిని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది.

Viral Video: ఈ పిచ్చుక మంచి మనసుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..


నొప్పితో విలవిల్లాడిన కోతి.. చివరకు శక్తిని మొత్తం కూడగట్టుకుని పామును గట్టిగా పక్కకు లాగేస్తుంది. కోతి పవర్ చూసిన పాము.. తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పటికే పాముపై విపరీతమైన కోపంతో ఉన్న కోతి.. పారిపోతున్న పామును పట్టుకుని.. ‘‘నాపైనే దాడి చేస్తావా’’.. అని అన్నట్లుగా దాన్ని కొరికేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! కోతికి పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘పాముతో అనవసరంగా పెట్టుకుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..

Updated Date - May 10 , 2024 | 08:59 PM