Share News

Viral Video: ఎంత పెళ్లి అయితే మాత్రం మరీ ఇదేంటీ.. ఈ వరుడి డాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - May 17 , 2024 | 05:00 PM

వివాహ కార్యక్రమాల్లో వధూవరులు డాన్సులు చేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. వరుడికి మంచి వధువు... వధువుకు మించి వరుడు పోటాపోటీగా డాన్సులు వేయడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు...

Viral Video: ఎంత పెళ్లి అయితే మాత్రం మరీ ఇదేంటీ.. ఈ వరుడి డాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వివాహ కార్యక్రమాల్లో వధూవరులు డాన్సులు చేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. వరుడికి మంచి వధువు... వధువుకు మించి వరుడు పోటాపోటీగా డాన్సులు వేయడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వరుడి విచిత్ర డాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎంత పెళ్లి అయితే మాత్రం.. మరీ ఇదేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరుడు ఊరేగింపుగా వస్తుంటాడు. సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయిన వరుడు.. బంధువులతో పాటూ నడుస్తూ వస్తుండగా.. వర్షం పడుతుండడంతో వెనుక ఉన్న ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని ఉంటాడు. మరోవైపు రోడ్డుపై వర్షపు నీరు, మట్టి పేరుకుని ఉంటుంది. మేళతాళాల మధ్య అంతా ఊరేగింపుగా వెళ్తుండగా.. మధ్యలో వరుడిని డాన్స్ చేయమని అంతా బలవంతపెడతారు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న పిల్లాడిని గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..


అప్పటికే ఎంతో ఖుషీ ఖుషీగా ఉన్న వరుడు.. వెంటనే రంగంలోకి (Groom Dance) దిగి డాన్స్ చేసేస్తాడు. ఏదో చేశాం అంటే చేశాం.. అన్నట్లు కాకుండా తన సంతోషాన్ని అందరికీ తెలియజేసేలా రెచ్చిపోతాడు. డాన్స్ చేస్తూనే మధ్యలో మధ్యలో రోడ్డుపై పడుకుని, బురదలో అటూ ఇటూ పొర్లుతూ డాన్స్ చేసేస్తాడు. మట్టిలో అటూ ఇటూ పొర్లడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. మరికొందరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు.

Puzzle: మీలోని ఏకాగ్రతకు ఇదో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


ఇలా చాలా సేపు అతను రోడ్డుపై డాన్స్ చేస్తూనే ఉంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇదే ఇతడికి చివరిహ్యాపీ మూమెంట్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు తొండాన్ని పట్టుకున్న మొసలి.. చివరకు ఎలా తప్పించుకుందో చూస్తే..

Updated Date - May 17 , 2024 | 05:00 PM