Share News

Viral Video: నదిలో సినిమాటిక్ రీల్ చేసేందుకు యువతి ప్రయత్నం.. అంతా బాగానే చేసింది కానీ.. చివర్లో..

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:26 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువతులు యువకులతో పోటీ పడి మరీ రీల్స్ చేస్తున్నారు. కొందరు అమ్మాయిలైతే.. జనాల మధ్యలో ఎలాంటి భయం లేకుండా వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు యువతులు సినిమా తరహాలో సీన్స్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ..

Viral Video: నదిలో సినిమాటిక్ రీల్ చేసేందుకు యువతి ప్రయత్నం.. అంతా బాగానే చేసింది కానీ.. చివర్లో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువతులు యువకులతో పోటీ పడి మరీ రీల్స్ చేస్తున్నారు. కొందరు అమ్మాయిలైతే.. జనాల మధ్యలో ఎలాంటి భయం లేకుండా వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు యువతులు సినిమా తరహాలో సీన్స్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి నదిలో సినిమాటిక్ రీల్ చేయాలని ప్రయత్నించింది. అయితే చివర్లో అత్యుత్సాహంతో చేసిన పనికి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం హరిద్వార్‌లోని విష్ణు ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి నదిలో ఉన్న శివలింగం వద్ద సినిమా సీన్ తరహాలో సాంగ్ చేస్తూ మంచి రీల్ తీయాలని ఓ యువతి ప్లాన్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసుకుని శివలింగం వద్దకు చేరుకుంది. తన స్నేహితులు వీడియో తీస్తుండగా.. శివలింగం వద్ద పాట పాడుతూ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


సదరు యువతి నీటిలో నడుస్తూ శివలింగం వద్ద కూర్చుని పాట పాడుతూ బాగానే యాక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఆమె అత్యుత్సాహం ప్రదర్శించింది. అక్కడే ఉన్న కర్రలపై నడుస్తూ సాంగ్ చేయాలని అనుకుంది. అయితే కర్రలపై నడిచే క్రమంలో (young woman fell into the water while reeling) ఒక్కసారిగా అదుపు తప్పి నీళ్లలో పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తాడు.

Viral Video: వావ్.. టైరుకు గాలి నింపే కొత్త టెక్నిక్.. మరీ ఎంత సింపుల్‌గా చేశాడంటే..


అయితే అప్పటికే ఆమె నీళ్లలో కొట్టుకుపోయింది. కాస్త ముందుకు కొట్టుకుపోగానే అక్కడే ఈదుకుంటూ వెళ్లి కర్రలను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొంపముంచిన యువతి అత్యుత్సాహం’’.. అంటూ కొందరు, ‘‘రీల్స్ చేయడం ఓకే గానీ.. పరిసరాలను గమనించడం కూడా ఎంతో ముఖ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 11 , 2024 | 06:26 PM