IPL 2024: గుజరాత్ నుంచి కీలక అప్డేట్.. షమీ స్థానంలో జట్టులోకి ఆ యువ బౌలర్
ABN , Publish Date - Mar 21 , 2024 | 08:41 AM
క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఉర్రుతలూగిలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మరొకొద్ది గంటల్లోనే ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.
క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులను ఉర్రుతలూగిలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మరొకొద్ది గంటల్లోనే ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది. లీగ్ ప్రారంభానికి సమయం ఆసన్నం కావడంతో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్లు కూడా ఇచ్చేస్తున్నాయి. ముఖ్యంగా గాయపడిన ఆటగాళ్ల స్థానంలో రిప్లేస్మెంట్కు సంబంధించిన అప్డేట్స్ను ఆయా జట్లు ఇస్తున్నాయి. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన గుజరాత్ టైటాన్స్ కీలక బౌలర్ మహ్మద్ షమీ స్థానానికి ఆ జట్టు రిప్లేస్మెంట్ ప్రకటించింది.
షమీ స్థానంలో మరో పేసర్ సందీప్ వారియర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ప్రకటించింది. అతని ప్రాథమిక ధర రూ.50 లక్షలకు గుజరాత్ తమ స్క్వాడ్‌లో చేర్చుకుంది. 32 ఏళ్ల సందీప్ వారియర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. 2019 నుంచి 2021 మధ్య సందీప్ వారియర్ కోల్‌కతానైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు. కానీ ఒక మ్యాచ్‌లో కూడా ఆడేందుకు అవకాశం రాలేదు. కాగా టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇటీవల గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. షమీ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకపోవడంతో అతని స్థానంలో గుజరాత్ టైటాన్స్ సందీప్ వారియర్‌ను జట్టులోకి తీసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా తమ జట్టులో ఓ మార్పు చేసింది. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన శ్రీలంకకు చెందిన పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో యువ పేసర్ సౌతాఫ్రికాకు బచెందిన క్వేనా మఫాకాను ముంబై తమ జట్టులో చేర్చుకుంది. అండర్ 19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన మఫాకా 6 మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.